STOCKS

News


మెటల్‌ షేర్ల మెరుపులు

Friday 26th April 2019
Markets_main1556273796.png-25372

ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ శుక్రవారం 2శాతం ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,991.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  అలాగే నిన్న క్యూ4 ఫలితాలను ప్రకటించిన టాటాస్టీల్‌ కంపెనీ షేర్లు నేడు 7శాతం ర్యాలీ చేయడం కూడా మెటల్‌ షేర్ల ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. జిందాల్‌ స్టీల్‌ 5శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో షేర్లు 2.50శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, సెయిల్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేయగా, నాల్కో మాత్రం 0.10శాతం స్వల్పంగా పెరిగింది. మరోవైపు వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, ఏపిల్‌ అపోలో, హిందుస్థాన్‌ జింక్‌, మెయిల్‌, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా, వేదాంత, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.  చివరికి నిఫ్టీ ఇండెక్స్‌ 1.88శాతం లాభపడి 3,046.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. 



You may be interested

11,750పైన ముగిసిన నిఫ్టీ

Friday 26th April 2019

39000 పైకి సెన్సెక్స్‌ రాణించిన మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు  చివరిగంట కొనుగోళ్లతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 6నెలల గరిష్టం నుంచి దిగిరావడం, ఈ వారంలో ఇప్పటి వరకూ ప్రకటితమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌వర్గాలను మెప్పించడం, దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్‌ 336 పాయింట్ల లాభపడి 39వేల పైన 39067.33 వద్ద, నిఫ్టీ 112.90 పాయింట్లు పెరిగి 11,750

రోలోవర్స్‌ సంకేతం...12,000 స్థాయికి నిఫ్టీ

Friday 26th April 2019

రోలోవర్స్‌ సంకేతం...12,000 స్థాయికి నిఫ్టీ ఏప్రిల్‌ నెలలో ఊరించిన నిఫ్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ 12,000 పాయింట్ల స్థాయిని మే నెలలో అందుకోవొచ్చన్న సంకేతాలు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో జరిగిన లాంగ్‌ రోలోవర్స్‌ సూచిస్తున్నట్లు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. మార్చి నెలలో భారీ ర్యాలీ జరిగిన తర్వాత ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌కు భారీగా లాంగ్‌ పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయని, అవి అలాగే కొనసాగించిన బుల్స్‌, వాటిని తిరిగి మే సిరీస్‌కు రోలోవర్‌ చేసినట్లు సెంట్రమ్‌ బ్రోకింగ్‌

Most from this category