STOCKS

News


కరిగిన మెటల్‌, రియల్టి షేర్లు

Friday 28th September 2018
Markets_main1538128228.png-20679

మార్కెట్‌ పతనంలో భాగంగా శుక్రవారం ట్రేడింగ్‌లో మెటల్‌, రియల్టీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ అత్యధికంగా 5శాతం నష్టపోగా, రియల్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు 5శాతం నష్టపోయింది.
నిఫ్టీ మెటల్‌ మెటల్‌ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 3,669.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత కొంతకాలంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతున్న మెటల్‌ షేర్లలో నేడు ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 5శాతం నష్టపోయింది. ఈ సూచీలోని వెల్‌స్పన్‌కార్పోరేషన్‌ అత్యధికంగా 16శాతం నష్టపోయింది. జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, జిందాల్‌ స్టీల్‌ 12శాతం పతనమయ్యాయి. అలాగే సెయిల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 8నుంచి 7శాతం నష్టపోయాయి. నాల్కో, హిందాల్కో, మెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, టాటా స్టీల్‌, ఏపిల్‌ అపోలో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 6 నుంచి 5 క్షీణించాయి. ఎన్‌ఎండీసీ, వేదాంత, కోల్‌ ఇండియా షేర్లు 4నుంచి 2శాతం పతనయ్యాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,669.70)తో పోలిస్తే 5.13శాతం నష్టంతో 3,481.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 231.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ పతనంలో ఇన్వెస్టర్లు ఈ షేర్లలో అమ్మకాలకు పూనుకున్నారు. ఫలితంగా రియల్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 5శాతం పతనమైన 219.60 పాయింట్లకు చేరుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(230.55)తో పోలిస్తే 4.75శాతం నష్టంతో 220.35వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచిలోని యూనిటెక్‌, ప్రస్టేజ్‌ షేర్లు అత్యధికంగా 10శాతానికి పైగా నష్టపోయాయి. ఐబీరియల్‌ఎస్టేట్స్‌ 9శాతం, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు 5నుంచి 3శాతం నష్టపోయాయి. శోభ, ఒబేరియాల్టీ, ఫోనిటెక్స్‌ లిమిటెడ్‌, సన్‌ టెక్‌ షేర్లు 2నుంచి 1శాతం వరకు నష్టపోయాయి.



You may be interested

యస్‌ బ్యాంక్‌...ఈ ధరలో యస్సేనా?

Friday 28th September 2018

ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూనల్‌ ఈక్విటీస్‌) నిశ్చల్‌ మహేశ్వరి తాజాగా కరెక‌్షన్‌ తర్వాత యస్‌ బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఏవిధంగా చూడాలి? మెటల్స్‌లో టాప్‌-4 స్టాక్స్‌ ఏంటి? అనే పలు అంశాలను తెలియజేశారు. అవేంటో ఆయన మాటాల్లోనే..  ♦ బ్యాంక్‌ను ఎవరు ముందుండి నడుపుతారనే అంశంపై స్పష్టత వచ్చే వరకు యస్‌ బ్యాంక్‌లో అస్థిరత కొనసాగుతుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరపు ప్రైస్‌-టు-బుక్‌ (పుస్తక విలువ) అంచనాలకు 1.2 రెట్లు, 1.3-1.4 రెట్లు వద్ద

10,900 లోపునకు నిఫ్టీ

Friday 28th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి వెళ్లడం ఇటీవల కాలంలో సాధారణమైంది. నిఫ్టీ-50 మళ్లీ 10,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నాం 2:15 సమయంలో సెన్సెక్స్‌ 183 పాయింట్ల నష్టంతో 36,141 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 10,888 పాయింట్ల వద్ద ట్రేడవతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,552 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే 36,101 కనిష్ట స్థాయికి పతనమైంది. అంటే గరిష్ట స్థాయి నుంచి

Most from this category