News


కళతప్పిన లోహ షేర్లు

Friday 26th October 2018
Markets_main1540529724.png-21490

ముంబై:- మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లోహ షేర్లు భారీ పతమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ సూచీ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం నష్టపోయింది. ఉదయం గం.10:00లకు సూచి గత ముగింపు(3,307)తో పోలిస్తే 1.75శాతం నష్టంతో 3,262ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా హిందాల్కో 3శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏపిల్‌ అపోలో షేర్లు 2శాతం నష్టపోయాయి. కోల్‌ ఇండియా, జిందాల్‌ స్టీల్‌, వేదాంత , జేఎస్‌ఎల్‌ హిస్పార్‌ స్టీల్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. హిందుస్థాన్‌కాపర్‌, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, సెయిల్‌, ఎన్‌ఎండీసీ, నాల్కో షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు టాటాస్టీల్‌ 1.50శాతం, మెయిల్‌ షేరు 1శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. హిందూస్థాన్‌ జింక్‌ అరశాతం లాభపడింది.You may be interested

ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్లకు ఆర్‌బీఐ షాక్‌..!

Friday 26th October 2018

ముంబై:- ఫైనాన్స్‌రంగ కంపెనీలైన ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 27 - 21శాతం పతనమయ్యాయి. ఇరు కంపెనీలు వేర్వేరుగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లను ప్రత్యేకంగా లిస్ట్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడం ఈ షేర్ల పతనానికి కారణమైంది. హోల్డింగ్‌ సంస్థల ద్వారా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ను నిర్వహిస్తున్న ప్రమోటర్లు తప్పనిసరిగా వీటిని  ప్రత్యేక సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ చేయాలని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. స్మాల్‌ ఫైనాన్స్‌

భారతి ఎయిర్‌టెల్‌ 3 శాతం జంప్‌

Friday 26th October 2018

సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిరుత్సాహకరమైన ఫలితాల్ని ప్రకటించినప్పటికీ, భారతీ ఎయిర్‌టెల్‌ శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి 3 శాతం లాభంతో రూ. 305 వద్దకు చేరుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.5 శాతం వరకూ నష్టపోయి రూ.287 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన ఈ షేరును హోల్డ్‌ నుంచి ‘బై’కి డాయిష్‌ బ్యాంక్‌ అప్‌గ్రేడ్‌ చేసి రూ. 425 టార్గెట్‌ ధరను ప్రకటించడంతో కనిష్టస్థాయిలో జరిగిన కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంతో లాభాల్లోకి మళ్లింది.

Most from this category