STOCKS

News


‘బీవోబీ’లో బ్యాంకుల విలీనంపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషణ

Thursday 3rd January 2019
Markets_main1546540117.png-23390

బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో విజయా, దేనా బ్యాంకుల విలీనం వల్ల ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన పంకజ్‌ పాండే పేర్కొన్నారు.  విలీనంతో మొత్తం మీద పుస్తక విలువ పెరుగుతుందని, బీవోబీకి గతంలో తాము రూ.135 టార్గెట్‌ ఇచ్చినట్టు తెలిపారు. సాధారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు పుస్తక విలువకు ఒక రెట్టు అధికంగా ట్రేడవుతుంటాయన్నారు. ఈ రకంగా చూస్తే బీవోబీ ఈ స్థాయి నుంచి రూ.7-8 వరకు పెరగొచ్చని, కానీ నిర్మాణ పరంగా చూస్తే ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం మాదిరిగా... విలీనం తాలూకూ తలనొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఎస్‌బీఐ గత రెండు మూడేళ్లుగా ఎటువంటి ప్రగతి చూపించని విషయాన్ని గుర్తు చేశారు. బీవోబీ విషయంలో అధిక వేతన వ్యయాలు, ప్రొవిజన్లు ఎక్కువని, దీంతో పనితీరు పరంగా పెద్ద మార్పు ఉండకపోవచ్చని విశ్లేషించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ ఒక్కటే మెరుగైన స్థానంలో ఉందని, అది ఇప్పటికే సవాళ్లను అధిగమించినట్టు చెప్పారు.

 

సోమానీ సిరామిక్స్‌ షేరును కొనుగోలుకు సూచించారు. ఇంతవరకు 60 శాతం దిద్దుబాటుకు గురైందని, గ్యాస్‌ ధరలు పెరగడం, కేరళ వరదల తాలూకూ ప్రభావంతో కంపెనీ విక్రయాలు 12-13 శాతం స్థాయిలో ప్రభావితమైనట్టు పంకజ్‌ పాండే చెప్పారు. గ్యాస్‌ సరఫరా పరంగా సవాళ్లతో ఉ‍త్పత్తి 8 శాతం తగ్గిందని, ఇవన్నీ కలసి కంపెనీ మార్జిన్లు 13.5 శాతం నుంచి 6.7 శాతం స్థాయికి తగ్గిపోయినట్టు పాండే వివరించారు. అయితే పరిస్థితులు మెరుగుపడడంతోపాటు మార్జిన్లు వచ్చే రెండేళ్లలో 10 శాతానికి పెరుగుతాయని అంచనా వేశారు. ఈ స్టాక్‌కు రూ.410 టార్గెట్‌ను ఇచ్చారు. ఏవియేషన్‌ రంగంపై సానుకూలంగా లేమని స్పష్టం చేశారు. టైర్‌-1 ఎయిర్‌పోర్టుల సామర్థ్యం మేరకు ట్రాఫిక్‌ చేరిపోయిందని వివరించారు. దీంతో ఏవియేషన్‌ కంపెనీలపై ఒత్తిడి ఉన్నట్టు చెప్పారు. You may be interested

ఆటుపోట్లను మర్చిపోండి... 2019లో భారీ లాభాలే?

Friday 4th January 2019

ఈ ఏడాది మంచి లాభాలకు అవకాశం ఉందని వారెన్‌ బఫెట్‌ సూచిక తెలియజేస్తోంది. చమురు ధరలు దిగిరావడం, రూపాయి పతనం ఆగడం, కమోడిటీ ధరలు పతనం కావడం వంటి సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అంతర్జాతీయంగా చైనా వృద్ధి మందగమనం, దేశీయంగా ఎన్నికలు సహా పలు అంశాల కారణంగా ఈ ఏడాది మన మార్కెట్లలో అస్థిరతలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో మంచి వృద్ధి

మార్కెట్లు ముందుకా... లేదంటే వెనక్కా?: ఏంజెల్‌ బ్రోకింగ్‌

Thursday 3rd January 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సామాన్య ఇన్వెస్టర్లకు అర్థం కావడం లేదు. డిసెంబర్‌ నెలలో రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు నిఫ్టీ 10,000 మార్క్‌ వరకు వెళ్లగా... ఫలితాల తర్వాత నుంచి ప్రధాన సూచీలు పైకే పరుగులు తీశాయి. దీంతో నిఫ్టీ 11,000మార్క్‌ సమీపానికి చేరుకుంది. ఇంకేముందు ఈ మార్క్‌ను దాటిపోతుందన్న అంచనాలతో ఉండగా... అనూహ్యంగా దిగువ వైపునకు పడిపోవడం ఆరంభించింది. గత రెండు సెషన్లలో మార్కెట్లు రెండు శాతం

Most from this category