STOCKS

News


గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 26th April 2019
Markets_main1556250425.png-25351

రెండు రోజులపాటు భారీ హెచ్చుతగ్గులకు లోనైన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 38,865 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,684 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన యాక్సిస్‌ బ్యాంక్‌ 2 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 764 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1 శాతంపైగా లాభంతో ప్రారంభమయ్యాయి. మారుతి, టాటా మోటార్స్‌, అదాని పోర్ట్స్‌, మహింద్రాలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. 

నాస్‌డాక్‌ కొత్త రికార్డు

బుధవారం రాత్రి అమెరికాలో రికార్డు గరిష్టస్థాయి 8,118 పాయింట్ల వద్ద ముగియగా, డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ అరశాతం నష్టంతో ముగిసింది. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌, చైనా సూచీలు అరశాతం నష్టపోగా, తైవాన్‌ వెయిటెడ్‌ సూచి 1 శాతంవరకూ పతనమయ్యింది. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి స్వల్పలాభంతోనూ, కొరియా కోస్పి, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు స్వల్ప నష్టాలతోనూ ట్రేడవుతున్నాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 26th April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా ప్రభావితమయ్యే కొన్ని షేర్ల వివరాలు  అపోటెక్స్‌ ఇండస్ట్రీయల్‌:- షేర్‌ విజభజనతో పాటు ప్రతి షేరుపై రూ.7.50ల వార్షిక డివిడెండ్‌ చెల్లింపునుకు బోర్డు ఆమోదం తెలిపింది.  ఓరియంటల్‌ హోటల్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతితో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ లేదా డెబిట్‌ సెక్యూరిటీల జారీ ద్వారా మూలధన నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- అమెరికాలో కొత్తగా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ప్రారంభిస్తున్నట్లు

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 26th April 2019

రెండు రోజులపాటు భారీ హెచ్చుతగ్గులకు లోనైన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించే  సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.45  గంటలకు దాదాపు ఫ్లాట్‌గా11,730 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,726 పాయింట్ల వద్ద ముగిసింది.  బుధవారం రాత్రి అమెరికాలో రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగియగా, డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ అరశాతం నష్టంతో ముగిసింది. తాజాగా

Most from this category