STOCKS

News


ఫలితాల షాక్‌...మారుతి 8 శాతం క్రాష్‌

Friday 25th January 2019
Markets_main1548408523.png-23805

క్యు3 ఫలితాల ఎఫెక్ట్‌
శుక్రవారం ట్రేడింగ్‌లో మారుతీ సుజుకీ షేరు దాదాపు 8 శాతం మేర నష్టపోయింది. మధ్యాహ్న సమయం వరకు స్వల్పలాభంలో ఉన్న షేరు క్యు3 ఫలితాల ప్రకటనతో అమాంతం పడిపోయింది. 2.50 నిమిషాలకు షేరు రూ6450కి అటుఇటుగా ట్రేడవుతోంది. గురువారం క్లోజింగ్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. ఒకదశలో షేరు 52 వారాల కనిష్ఠస్థాయి రూ.6410కి పతనమైంది. తిరిగి కొంత కోలుకొని రూ. 6450 వద్దకు చేరింది. క్యు3లో మారుతీ నికరలాభం 17 శాతం క్షీణించింది. నికర విక్రయాలు సైతం బలహీనంగా నమోదయ్యాయి. మార్కెట్‌ పరిస్థితులు బలహీనంగా ఉండడంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయని కంపెనీ తెలిపింది. 



You may be interested

రియల్టీ షేర్ల పతనం

Friday 25th January 2019

మిడ్‌ సెషన్‌ అనంతరం రియల్టీ రంగ షేర్లలో భారీ అ‍మ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతనిధ్యం నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఈ రంగానికి చెందిన డీఎల్‌ఎఫ్‌ కంపెనీ ఢిల్లీలోని ఉన్న ప్రధాన కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించారని మీడియాలో వార్తలు వెలువడంతో కంపెనీ షేరు 8శాతం పతనం రియల్టీ ఇండెక్స్‌ను బాగా దెబ్బతీశాయి. అలాగే యూనిటెక్‌ 3శాతం, శోభ 2.50శాతం, ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌, ఓబేరాయ్‌ రియల్టీ

రెండోరోజూ యస్‌ బ్యాంక్‌ ర్యాలీ

Friday 25th January 2019

యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ రెండో  కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరో 10.50శాతం ర్యాలీ చేసింది. కొత్త  సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామకం, క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకోవడం, బ్రోకరేజ్‌ సంస్థలు షేరు రేటింగ్‌ను పెంచడం తదితర అంశాలు షేరు ర్యాలీకి తోడ్పాటు అందించాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఇంట్రాడేలో మరో  14 శాతం ర్యాలీ చేసి రూ.245 వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు

Most from this category