STOCKS

News


మారుతి రివర్స్‌ జర్నీ ఎక్కడి వరకు?

Wednesday 10th October 2018
Markets_main1539111381.png-20987

కార్ల రంగంలో రారాజు ‘మారుతి సుజుకి’ షేరు గత నెలన్నర రోజులుగా బేల చూపులు చూస్తోంది. గతేడాది డిసెంబర్‌లో నమోదైన గరిష్ట ధర రూ.9,996 నుంచి ఇప్పటికి 33 శాతం క్షీణించింది. మంగళవారం నాటి క్లోజింగ్‌ ధర రూ.6,691.90. మంగళవారం ఒక్కరోజే మూడు శాతం పడిపోయింది. బలమైన ఆర్థిక మూలాలు, అధిక మార్కెట్‌ వాటా కలిగిన మారుతి ఈ విధంగా పడిపోవడంతో... ఈ పతనం ఎంత వరకు? అన్న సందేహం ఇన్వెస్టర్లకు వస్తోంది. దీనికి మార్కెట్‌ నిపుణులు చెబుతున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

 

కేరళలో వరదలు మిగిల్చిన నష్టాలతో పండుగ అమ్మకాలు నీరసంగానే మొదలయ్యాయి. వడ్డీ రేట్ల పెరుగుదల, పెరుగుతున్న చమురు ధరలతో రానున్న పండగ సీజన్‌లో వాహనాల విక్రయాలపై అంచనాలు ఆశాజనకంగా లేవు. నిజానికి పండుగల సీజన్‌లోనే వాహన విక్రయాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. కానీ, ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఆటో స్టాక్స్‌ ధరలపై ప్రభావం చూపిస్తోంది. అయితే, మారుతి సుజుకీ షేరు పడి లేస్తుందన్న అంచనాను విశ్లేషకులు చెబుతున్నారు. నిర్మల్‌బంగ్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నీరవ్‌చెద్దా మాట్లాడుతూ... మారుతి సుజుకి షార్ట్‌ టర్మ్‌ బౌన్స్‌ కావొచ్చని, రూ.6,650 స్టాప్‌లాస్‌తో ఎంటర్‌ కావొచ్చని సూచించారు. రూ.7,200 టార్గెట్‌ ధరను ఆశించొచ్చని చెప్పారు. ‘‘దీర్ధకాల ట్రెండ్‌ ప్రతికూలంగానే ఉంది. ఈ స్టాక్‌ తిరిగి బలాన్ని చూపించే ముందు రూ.6,200-6,000 స్థాయి వరకు పడిపోవచ్చు’’ అని చెద్దా వివరించారు. 

 

మారుతి సుజుకి భారీ టాప్‌ను నమోదు చేసిన తర్వాత పెరిగిన మొత్తంలో 62 శాతం కోల్పోయిందని చార్ట్‌వ్యూ ఇండియా సంస్థ టెక్నికల్‌ రీసెర్చ్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మొహమ్మద్‌ తెలిపారు. ‘‘ఈ ప్రకారం చూస్తే 2016 ఫిబ్రవరిలో రూ.3,193 నుంచి 2017 డిసెంబర్‌లో నమోదైన రూ.9,996 అప్‌మూవ్‌ను కోల్పోతే... రూ.5,779 వరకు (ఫిబోనాసి రీట్రేస్‌మెంట్‌ స్థాయి) దిద్దుబాటుకు గురవుతుంది. పలు టెక్నికల్‌ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత... స్టాక్‌ తిరిగి అప్‌మూవ్‌కు వెళ్లే ముందు తగినంత స్థిరపడే వరకు వేచి చూడాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం’’ అని మొహమ్మద్‌ తెలిపారు. దీర్ఘకాలిక చార్ట్‌ల ప్రకారం మారుతికి రూ.6,750 వద్ద మద్దతు ఉందని తెలిపారు. ఈ స్థాయిని కోల్పోయినందున... రూ.5,805-5,779 స్థాయి వరకు వెళుతుందన్నారు. ఈ స్టాక్‌ ఇంకా బోటమ్‌ను ధ్రువీకరించలేదని, ప్రస్తుత స్థాయిల్లో నమోదు చేసే అవకాశం ఉందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 10th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 18 పాయింట్ల లాభంతో 10,329 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,314 పాయింట్లతో పోలిస్తే 15 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా

ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయం 

Wednesday 10th October 2018

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఇటీవలి చేసిన పలు మార్పులతో మంచి ఆకర్షణీణయమైన రిటైర్మెంట్‌ సాధనంగా మారిపోయింది. చందాదారులకు మరింత అనుకూలంగా ఉండేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ పలు చర్యలు తీసుకుంది.    అస్సెట్‌ అలోకేషన్‌ అస్సెట్‌ అలోకేషన్‌లో మార్పులు చేయడం జరిగింది. గతంలో యాక్టివ్‌ చాయిస్‌ ఆప్షన్‌ (అంటే ఇన్వెస్టర్లు ఈక్విటీ, డెట్‌లో ఎంత మేర పెట్టుబడులన్నది సొంతంగా నిర్ణయించుకునేది)లో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపు 50 శాతమే ఉండేది. కానీ, అక్టోబర్‌ 1 నుంచి ఇది

Most from this category