STOCKS

News


రెండు నెలల తర్వాత గడ్డుకాలం?

Saturday 23rd March 2019
Markets_main1553332990.png-24768

మార్కెట్‌పై యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా
దేశీయంగా కొనసాగుతున్న ర్యాలీ మరో రెండు నెలలు ఉండొచ్చని, కానీ ఆ తర్వాత వాల్యూషన్ల కారణంగా చల్లబడిపోతుందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌతం చచ్చోరియా అభిప్రాయపడ్డారు. తాజా అప్‌మూవ్‌తో రెండుమూడు నెలల్లో పలు స్టాకుల వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారతాయన్నారు. మోదీ ప్రభుత్వం మరోమారు విజయం సాధిస్తుందన్న నమ్మకం, లిక్విడిటీ వరద  ప్రస్తుత ర్యాలీకి ప్రధాన కారణాలన్నారు. ఈ కారణాలతో మరో రెండు నెలలు వాల్యూషన్లతో సంబంధం లేకుండా మార్కెట్‌ పరుగులుంటాయన్నారు. ఆ తర్వాత ఏడాది కాలం పాటు మార్కెట్లు కన్సాలిడేట్‌ అవుతాయని, ఇందుకు వాల్యూషన్లే కారణమని చెప్పారు.

బీజేపీకి సొంతంగా పూర్తి మెజార్టీ రాకున్నా, బలమైన సంకీర్ణమైనా ఏర్పరుస్తుందని, దీంతో సంస్కరణలు కొనసాగుతాయని మార్కెట్‌ ఆశిస్తోందన్నారు. పరుగుల అనంతరం మార్కెట్‌ చల్లబడుతుందని, డిసెంబర్‌నాటికి నిఫ్టీ తిరిగి 10500 పాయింట్లకు చేరుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో ఎర్నింగ్స్‌లో మంచి వృద్ది ఉంటుందన్న అంచనాను మార్కెట్లు డీస్కౌంట్‌ చేస్తోందన్నారు. మరోవైపు ఆర్‌బీఐ తన పాలసీని సడలిస్తోందని, అయితే అంతమాత్రాన తిరిగి ఉద్దీపనల శకానికి వెళతామని భావించడంలేదని చెప్పారు. చాలా సంవత్సరాలుగా ఇండియా కార్పొరేట్‌ రంగానికి, ఎకానమీకి ఎర్నింగ్స్‌లో మందగమనం అతిపెద్ద సవాలుగా ఉందన్నారు. ప్రతిఏడాది ఆరంభంలో అనలిస్టులు ఈ సంవత్సరం తప్పక ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఉంటుందని అంచనాలు వేయడం, చివరకు అవి ఫలించకపోవడం జరుగుతోందన్నారు. మార్కెట్లు మోదీ తిరిగి వస్తాడని బలంగా నమ్ముతున్నాయని, ఇందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలుంటే మాత్రం మార్కెట్లో భారీ కల్లోలం తప్పదని గౌతం హెచ్చరించారు. 



You may be interested

చల్లారుతున్న క్రూడ్‌ ధర

Saturday 23rd March 2019

ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర మరో రెండు శాతం పతనమైంది. యూఎస్, చైనా ట్రేడ్‌ చర్చల్లో పురోగతి లేకపోవడం, జర్మనీ ఉత్పత్తి డేటా పేలవంగా ఉండడం, గ్లోబల్‌ ఎకానమీ నెమ్మదిస్తోందన్న ఫెడ్‌ అంచనాలు.. చమురు ధరలపై ‍ప్రభావం చూపాయి. దీంతో శుక్రవారం యూఎస్‌ సూచీలు సైతం భారీ నష్టాలను నమోదు చేశాయి. వారం ముగింపు వేళ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 67.30 డాలర్ల వద్ద

11400 వద్దకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం భారీ నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపు(11470)తో పోలిస్తే 63 పాయింట్ల నష్టంతో 11,407.00 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11472.40 పాయింట్లతో పోలిస్తే 71 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. వచ్చే వారంలో గురువారం(28న)మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు ఉండటంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక

Most from this category