STOCKS

News


మేలో మేజర్‌ స్పీడ్‌బ్రేకర్‌?!

Saturday 20th April 2019
Markets_main1555756708.png-25248

నిఫ్టీపై నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌కు చెక్‌ పెట్టి మరలా పైకి ఎగిశాయి. ఈ వారం సరికొత్త ఆల్‌టైమ్‌హైని తాకాయి. అయితే వారం చివర్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదయింది. ఎన్నికల అస్పష్టత, వరుస సెలవల నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లు తగ్గించుకున్నారు. ప్రస్తుతం 11800 పాయింట్ల వద్ద భారీ పుట్‌రైటింగ్‌ పరిశీలిస్తే స్వల్ప అప్‌మూవ్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల హవా ఆరంభమైంది. ఇవన్నీ మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తున్నాయి. అయితే మేనెల మధ్యలో ఈ పరుగులకు స్పీడ్‌ బ్రేకర్‌ ఉండొచ్చని అంచనా. ఆ సమయానికి ఎన్నికల ఫలితాలు బయటకువస్తాయి. ఫలితాల ఆధారంగా మార్కెట్ల తదుపరి కదలికలుంటాయి. అప్పటివరకు ఫలితాల సీజన్‌ ఆధారిత కదలికలుంటాయి. ప్రస్తుతానికి ఐటీ కంపెనీల ఫలితాలు ఫర్వాలేదనిపిస్తున్నాయి. నిఫ్టీ చార్టుల్లో ఇంతవరకు చూడని 11800పాయింట్ల పైస్థాయిల జోన్‌లోకి వెళ్లి వచ్చింది. అందువల్ల టెక్నికల్‌గా కదలికల అంచనా కొంచెం కష్టంగా ఉండొచ్చు. గత నిరోధం 11730 పాయింట్లు నిఫ్టీకి తక్షణమద్దతుగా నిలుస్తుంది. ఈ స్థాయిని కోల్పోతే మరింత పతనం ఉండొచ్చు. మదుపరులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త లాంగ్స్‌ జోలికి వెళ్లకుండా ఉన్న పొజిషన్లను కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో పాటించడం ఉత్తమం. ఓవర్‌బాట్‌ కౌంటర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయడం మంచిది. వీఐఎక్స్‌ పెరిగిపోవడం అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాన్ని ఇస్తోంది. ఈ సీరిస్‌లో కాకున్నా, మే సీరిస్‌లోనైనా కొంత మేర పతనం తప్పకపోవచ్చు. అప్పటివరకు వేచిచూసి ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్లో కొత్త పొజిషన్లు తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా.You may be interested

మస్టేక్‌ షేరు కొనవచ్చు: ఆనంద్‌ రాఠి

Saturday 20th April 2019

ఐటీ రంగంలో సేవలు అందించే మధ్యస్థాయి కంపెనీ మస్టేక్‌ షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ ఆనంద్‌రాఠీ సిఫార్సు చేస్తుంది.  షేరు:- మస్టేక్‌  రేటింగ్‌:- బై టార్గెట్‌ ధర:- రూ.670లు విశ్లేషణ:- గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం క్వార్టర్‌ టు క్వార్టర్‌ 1.7శాతం పెరిగి రూ.262 కోట్లుగా నమోదైంది. ఎబిటా క్వార్టర్‌ టు క్వార్టర్‌ 13.2శాతం పెరిగింది. దీర్ఘకాలిక ప్రాజెక్టుల పూర్తి చేయడంలో విఫలమడంతో పాటు పాటు యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి

వాల్యూ పిక్స్‌ కావాలా..

Saturday 20th April 2019

క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ను ఎంచుకోండి నిపుణుల సలహా గత కొన్నేళ్లుగా ప్రధాన మార్కెట్‌తో పోలిస్తే పేలవ ప్రదర్శన చూపుతున్న క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీల స్టాకులపై పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏబీబీ, సీమెన్స్‌, కమిన్స్‌ ఇండియా, థెర్మాక్స్‌ లాంటి క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాకుల వాల్యూషన్లు వాటి చారిత్రక సరాసరిల కన్నా తక్కువగా ఉన్నాయని, పెట్టుబడుల వలయం పుంజుకునే ఈ తరుణంలో ఇకపై ఈ కంపెనీలు సత్తా చూపుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల

Most from this category