STOCKS

News


వచ్చే ఏడాదికి ఎస్‌ఎంసీ గ్లోబల్‌ 10 సిఫార్సులు

Tuesday 25th December 2018
Markets_main1545732562.png-23225

అధిక క్రూడ్‌ ధరలు, విదేశీ ఇన్వస్టర్ల అమ్మకాలతో ఈ ఏడాది  సతమతమైన మార్కెట్‌ వచ్చే ఏడాది మెరుగైన రాబడుల్ని ఇవ్వవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనావేసింది.  అయితే ఇటీవల క్రూడ్‌ ధర దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టడం సానుకూలమయ్యింది.  ఈ ఏడాదిలో ఇతర వర్థమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే మనదేశీయ మార్కెట్‌ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆర్థిక వృద్ధి మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు, పలు దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకుల కఠిన వైఖరి కారణంగా వచ్చే ఏడాది ప్రపంచమార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడవచ్చని, అయినా దేశీయ వినియోగ వృద్ధితో ఇక్కడి మార్కెట్‌ మెరుగైన రాబడుల్ని ఇవ్వవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ విశ్లేషించింది. సాదారణంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు అత్యధిక జనాభ కలిగిన గ్రామీణ ప్రాంతాల వైపు  దృష్టిని సారించి, పెట్టుబడుల్ని పెంచుతాయని,  తద్వారా గ్రామీణ వినియోగం పెరుగుతుందని,  మూలధన వ్యయం, పబ్లిక్‌ క్యాపెక్స్‌ ప్రవాహాలు ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందిస్తాయని బ్రోకరేజ్‌ సంస్థ వివరించింది.  
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ఓ పది స్టాక్‌లు 15-28శాతం వరకు లాభాలను పంచవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేసింది.  ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌, టొరెంటో పవర్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌ షేర్లులున్నాయి.



You may be interested

రుచి సోయా అంటే ‘పతంజలి’కి ఎందుకంత ఆసక్తి?

Tuesday 25th December 2018

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌... వంట నూనెల్లో అతిపెద్ద కంపెనీ అయిన రుచిసోయాను సొంతం చేసుకునేందుకు ఇప్పటికీ ఆసక్తిగానే ఉంది. అదానీ విల్‌మర్‌ బిడ్‌ గెలిచినప్పటికీ... దివాలా పరిష్కార ప్రక్రియను ముగించే విషయంలో తీవ్ర జాప్యాన్ని పేర్కొంటూ ఆ సంస్థ తన ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. బిడ్డింగ్‌లో అదానీ తర్వాత పతంజలి సంస్థే రెండో స్థానంలో ఉంది కనుక, రుచి సోయా పతంజలి పరం అయ్యే అవకాశాలు

ఏడాదిన్నర కనిష్టానికి క్రూడాయిల్‌

Tuesday 25th December 2018

ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో పాటు క్రూడ్‌ ఉత్పత్తి పెరుగుదలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర ఏడాదిన్నర కనిష్టానికి పతనమయ్యింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. క్రూడ్ ఉత్పత్తిదారులు తన ఉత్పత్తులను భారీగా పెంచడంతో క్రూడాయిల్‌ ధర వారంలో రోజుల్లోనే ఏకంగా 11శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా దిగివచ్చింది. మరోవైపు ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిలో కోత

Most from this category