STOCKS

News


రికవరీ కన్నా ముందు మరింత పతనం!

Friday 5th October 2018
Markets_main1538732242.png-20896

దేశీ మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ క్రిస్‌వుడ్‌ అంచనా
భారత మార్కెట్లు బాగుపడేముందు మరింత పతనానికి గురవుతాయని సీఎల్‌ఎస్‌ఏ అనలిస్ట్‌ క్రిస్‌వుడ్‌ అంచనా వేశారు. ఇప్పుడున్న స్థాయిల నుంచి మరింత పతనమయ్యాకనే సూచీలు తిరిగి పాజిటివ్‌ అడుగులు వేస్తాయన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటపడ్డాక వచ్చిన పతనంతో తమ ఆసియా పోర్టుఫోలియో బాగా దెబ్బతిన్నదని చెప్పారు. తమ పెట్టుబడుల్లో 49 శాతం ఇండియాలో ఉన్నాయన్నారు. ఇందులో సింహభాగం వాటా ఫైనాన్షియల్స్‌దే కావడం గమనార్హం. తాజా పతనంలో ఫైనాన్షియల్‌ కంపెనీల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. దీంతో తమ పోర్టుఫోలియో నష్టాలను చవిచూసిందని క్రిస్‌వుడ్‌ చెప్పారు. గత త్రైమాసికంలో దేశీయ సూచీలు 1.4 శాతం క్షీణించాయి. ఇదే సమయంలో క్రిస్‌వుడ్‌ పోర్టుఫోలియో 11.8 శాతం క్షీణించింది.

2002 నుంచి తమ భారత పోర్టుఫోలియోలో ఫైనాన్షియల్స్‌ది కీలక పాత్రన్నారు. అప్పటినుంచి విత్త సంస్థల షేర్లు మంచి రాబడులనే అందిస్తూ వచ్చాయని వివరించారు. 2005 నుంచి ఇంత వరకు నిఫ్టీ 413 శాతం రాబడినివ్వగా నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీ 1295 శాతం లాభపడింది. తాజా క్షీణతతో తాము వెనుకంజ వేయమని వుడ్‌ చెప్పారు. దేశీయ విత్త సంస్థల స్టాకులపై దీర్ఘకాలిక పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. ఎనర్జీ రంగంపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నామని వుడ్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో క్రూడ్‌ ధర 150 డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. దీర్ఘకాలానికి ఆర్‌ఐఎల్‌, ఐబీహౌసింగ్‌, గృహ్‌ ఫైనాన్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లను ఆయన రికమండ్‌ చేశారు. 



You may be interested

మారుతీ సుజుకీ... మహా పతనం ఎందుకు?

Friday 5th October 2018

36 రోజుల్లో 26 శాతం క్షీణించిన షేరు దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ షేరు గత నెల రోజులుగా భారీ కరెక‌్షన్‌లోకి జారుకుంది. ఆగస్టు 28న 9400 రూపాయల వద్ద ఉన్న మారుతీ షేరు ధర అక్టోబర్‌ 5 నాటికి 6900 రూపాయలకు దిగివచ్చింది. అంటే దాదాపు నెల రోజుల్లో సుమారు 26 శాతం క్షీణించింది. బ్రోకరేజ్‌లు మెచ్చిన మారుతీ షేరు ఇంతలా పతనం కావడం రిటైల్‌ ఇన్వెస్టర్లను

రూపీ @ 74

Friday 5th October 2018

ఇండియన్‌ రూపాయి నిట్టనిలువునా కుప్పకూలింది. ఇప్పటికే క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి వాటితో ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయిపై.. ఆర్‌బీఐ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నాం 2:45 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 73.64 వద్ద ప్రారంభమైంది. తర్వాత

Most from this category