STOCKS

News


మార్కెట్లు ముందుకా... లేదంటే వెనక్కా?: ఏంజెల్‌ బ్రోకింగ్‌

Thursday 3rd January 2019
Markets_main1546539755.png-23389

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సామాన్య ఇన్వెస్టర్లకు అర్థం కావడం లేదు. డిసెంబర్‌ నెలలో రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు నిఫ్టీ 10,000 మార్క్‌ వరకు వెళ్లగా... ఫలితాల తర్వాత నుంచి ప్రధాన సూచీలు పైకే పరుగులు తీశాయి. దీంతో నిఫ్టీ 11,000మార్క్‌ సమీపానికి చేరుకుంది. ఇంకేముందు ఈ మార్క్‌ను దాటిపోతుందన్న అంచనాలతో ఉండగా... అనూహ్యంగా దిగువ వైపునకు పడిపోవడం ఆరంభించింది. గత రెండు సెషన్లలో మార్కెట్లు రెండు శాతం మేర నష్టపోయాయి. దీంతో మార్కెట్లపై ఏంజెల్‌ బ్రోకింగ్‌ చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చవాన్‌ విశ్లేషణ ఇలా ఉంది.

 

‘‘అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు మన మార్కెట్లను గణనీయంగా పడేశాయి. గురువారం మార్కెట్‌ ఆరంభంలో కొన్ని గంటల పాటు పెద్ద ఎత్తున అటూ, ఇటూ కదలికలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు రోజు గరిష్ట స్థాయి 10810 గట్టి నిరోధంగా పనిచేసింది. ఇండెక్స్‌ ముందు రోజు పతనాన్ని కొనసాగించింది. దాంతో 10,700 మార్క్‌ను దిగిపోయి క్లోజయింది. మార్కెట్‌ వ్యాప్తంగా అదే పనిగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో మార్కెట్‌ ఒక శాతం నష్టపోయింది. ముందు రోజు కనిష్ట స్థాయి 10735ను బ్రేక్‌ చేయడంతో గురువారం కరెక్షన్‌ కొనసాగింది. ఇటీవలి అప్‌మూవ్‌లో 61.8 శాతం మేర ఇండెక్స్‌ కోల్పోయింది. 100 శాతం స్థాయి 10,670, 10620 వద్ద ఉంది. సూచీ ఇప్పుడు ముందుకు వెళ్లడం లేదా బ్రేక్‌ కావడం అనే స్థాయిలో ఉంది. దీంతో రానున్న సెషన్‌ (శుక్రవారం) చాలా కీలకం అవుతుంది. మార్కెట్‌ స్వల్పకాల గమనాన్ని ఇది నిర్దేశిస్తుంది. ఈ కీలక స్థాయిలను జాగ్రత్తగా గమనించాలి. ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్‌ చేయకుండా, తక్కువ పొజిషన్లతో... అంతర్జాతీయంగా వోలటాలిటీ తగ్గిపోయే వరకు వేచి చూడాలి’’అని సమీత్‌ చవాన్‌ సూచించారు.



You may be interested

‘బీవోబీ’లో బ్యాంకుల విలీనంపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషణ

Thursday 3rd January 2019

బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో విజయా, దేనా బ్యాంకుల విలీనం వల్ల ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన పంకజ్‌ పాండే పేర్కొన్నారు.  విలీనంతో మొత్తం మీద పుస్తక విలువ పెరుగుతుందని, బీవోబీకి గతంలో తాము రూ.135 టార్గెట్‌ ఇచ్చినట్టు తెలిపారు. సాధారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు పుస్తక విలువకు ఒక రెట్టు అధికంగా ట్రేడవుతుంటాయన్నారు. ఈ రకంగా చూస్తే బీవోబీ ఈ స్థాయి నుంచి రూ.7-8

10,700 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 3rd January 2019

377 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ రెండో రోజూ నష్టాల ముగింపే అంతర్జాతీయ మార్కెట్లలలో నెలకొన్న బలహీన పరిస్థితలకు, డాలర్‌ మారకంలో రూపాయి పతనం తోడవ్వడంతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. గత ట్రేడింగ్‌ భారీ నష్టపోయి సూచీలను నష్టాల బాట పట్టించిన మెటల్‌, అటో రంగ షేర్లకు నేడు తాజాగా ఫార్మా రంగ పతనం జతకలవడంతో సెన్సెక్స్‌ 377 పాయింట్లు నష్టపోయి 35,513 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 10700

Most from this category