STOCKS

News


ఈ మూడింటిలో వ్యాల్యుయేషన్‌కు ఛాన్స్‌..

Thursday 11th October 2018
Markets_main1539254409.png-21054

మార్కెట్‌ ఇంకా ఓవర్‌వ్యాల్యుతోనే ఉందన్నారు మెర్కులస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ. ఇండియన్‌ మార్కెట్‌ తన ఫెయిర్‌ వ్యాల్యుకు 10-15 శాతం దూరంలో ఉందని తెలిపారు. అయితే ఐటీ, ఫార్మా, ఎగుమతి ఆధారిత ఆటో రంగ స్టాక్స్‌లో విలువకు అవకాశముందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్స్‌ ఓవర్‌ వ్యాల్యుయేషన్స్‌తో ఉన్నాయని తెలిపారు. వీటిల్లో ఇంకా డీరేటింగ్‌కు అవకాశముందని పేర్కొన్నారు. ఐటీలో ఇప్పటికీ వ్యాల్యుయేషన్‌కు అవకాశముందని తెలిపారు. ఫార్మాలో అయితే ఇంకా మంచి వ్యాల్యుయేషన్స్‌కు ఛాన్స్‌ ఉందన్నారు. ఎగుమతి ఆధారిత ఆటో స్టాక్స్‌ను కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. హోల్‌సెల్‌ ఫండ్‌ లెండర్లలో ఓవర్‌ వ్యాల్యుయేషన్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, మారికో వంటి నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేసి దీర్ఘకాలంలో హోల్డ్‌ చేయవచ్చని తెలిపారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు నాణ్యతను చూడాలని, అంతేకానీ మార్కెట్‌ ప్రస్తుతం ఎలా ఉంది? ఫెడ్‌ రేట్లు పెంచుతుందా? అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? వంటి అంశాలను కాదని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో లార్జ్‌క్యాప్స్‌లో టీసీఎస్‌లో వ్యాల్యుయేషన్‌కు చాన్స్‌ ఉందన్నారు. ఇక మిడ్‌క్యాప్స్‌లో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ను హోల్డ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. 



You may be interested

వీటి బైబ్యాక్‌ దేనికి సంకేతం?

Thursday 11th October 2018

ఓ కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేస్తోందంటే, ఆ కంపెనీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉందన్న సంకేతాన్నిస్తున్నట్టే. సదరు కంపెనీ షేరు ధర వాస్తవ విలువకు చాలా తక్కువ స్థాయికి చేరినా లేదా కంపెనీ వద్ద పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండి, వ్యాపార అవసరాలకు అంతగా నిధుల అవసరం లేని సందర్భాల్లోనూ కంపెనీలు, షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేస్తుంటాయి. తద్వారా వాటాల విలువను పెంచే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో

దలాల్‌ స్ట్రీట్‌లో వాల్‌స్ట్రీల్‌ మంటలు

Thursday 11th October 2018

759 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 10,250ల దిగువకు నిఫ్టీ వాల్‌స్ట్రీట్‌లో బుధవారం రాత్రి రాజుకున్న అమ్మకాల మంటలు సెగలు గురువారం మన మార్కెట్‌ను తాకాయి. ఫలితంగా ఐటీ, ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఈ ఏడాదిలో ఆర్జించిన లాభాలన్నీ కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1038 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయింది. మిడ్‌సెషన్‌లో సూచీలు కొంత రికవరీ బాటలో సాగినప్పటికి.., ఆ ర్యాలీ ఎంతోసేపు నిలువలేదు యూరప్‌

Most from this category