2019 బీజేపీ ఓడినా.. ట్రాక్‌లోనే మార్కెట్!!
By Sakshi

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా కూడా స్టాక్ మార్కెట్ ట్రాక్‌లోనే ఉంటుందని మార్కెట్ నిణుపుడు అంబరీష్ బాలిగా తెలిపారు. బుల్ మార్కెట్లో హోల్డింగ్ కంపెనీలు మంచి పనితీరు కనబరుస్తాయని, అందువల్ల వచ్చే 2 ఏళ్ల లక్ష్యంతో ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 2019 ప్రారంభంలో మార్కెట్ పేలవంగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే బీజేపీ అనుకూల పవనాలు వీస్తే పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనే అంశం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 2019లో చక్కెర పరిశ్రమ ఆశ్చర్యకరమైన పనితీరు కనబర్చవచ్చని అంబరీష్ బాలిగా అంచనా వేశారు. షుగర్ మిల్లులు.. సాంప్రదాయిక చక్కెర తయారీ విధానంలో కాకుండా డైరెక్ట్‌గానే ఇథనాల్‌ను తయారు చేసేందుకు కేంద్రం పాలసీలో మార్పులు తీసుకురావడం చక్కెర పరిశ్రమకు చాలా సానుకూల అంశమని పేర్కొన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను ఎక్కువ కలిపేందుకు ప్రభుత్వం అంగీకరించడం మరొక పాజిటివ్ అంశమని తెలిపారు. హోల్డింగ్ కంపెనీల స్టాక్స్ బాగా కరెక్షన్కు గురయ్యాయని, చాలా వరకు 60 శాతం డిస్కౌంట్లో లభ్యమౌతున్నాయని పేర్కొన్నారు. బుల్ మార్కెట్లో ఇవి ఔట్‌పర్ఫార్మ్ చేస్తాయని, 2 ఏళ్ల లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. పిలానీ ఇన్వెస్ట్మెంట్స్, యునిఫోస్ ఎంటర్ప్రైజెస్, బీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. మార్కెట్ మొత్తంగా చూస్తే పేలవంగా ఉండొచ్చని అంబరీష్ బాలిగా పేర్కొన్నారు. అయితే స్టాక్ ఆధారిత కదలికలు ఉంటాయని తెలిపారు. ఏడాది లక్ష్యంతో ప్రస్తుత స్థాయిలో కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. 2019లో ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. సిమెంట్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాల్లో రికవరీ ఉంటుందని తెలిపారు. పోర్ట్‌ఫోలియో విషయానికి వస్తే.. 60 శాతాన్ని ఈక్విటీల్లో, 30 శాతాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో, 10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. రానున్న కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 70/71 స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేశారు. 2019లో స్థిర ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూపాయి మరింత బలపడొచ్చని తెలిపారు. 2019 ప్రారంభంలోనూ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్‌పై ఒత్తిడి కొనసాగవచ్చని పేర్కొన్నారు.
♦ బీజేపీ/ఎన్డీఏకు మెజారిటీ వస్తే: మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అవుతాయి. ర్యాలీ ఉంటుంది. ఇండెక్స్‌లు కొత్త గరిష్ట స్థాయిలకు చేరతాయి.
♦ విశ్వసనీయ మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలో వస్తే: మార్కెట్ ఒక కుదుపునకు లోనవుతుంది. కొన్ని నెలల తర్వాత సర్దుకొని మళ్లీ సాధారణ స్థాయికి వస్తుంది.
♦ అస్థిరమైన బలహీన ప్రభుత్వం ఏర్పాటైతే: మార్కెట్లు పతనమౌతాయి. ఇండెక్స్‌లు కనిష్ట స్థాయిలకు పడిపోతాయి.
You may be interested
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ అప్..
Wednesday 19th December 2018ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 39 పాయింట్ల లాభంతో 10,994 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ మంగళవారం ముగింపు స్థాయి 10,935 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక
రూపాయి ర్యాలీతో ఆరో రోజూ లాభాలే
Tuesday 18th December 201810900 పైన నిఫ్టీ కలిసొచ్చిన చివరి గంట కొనుగోళ్లు రూపాయి ర్యాలీతో మార్కెట్ ఆరోరోజూ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం నిఫ్టీ సూచీ 10,900పైన ముగియగా సెన్సెక్స్ 77 పాయింట్ల లాభాల్ని ఆర్జించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో పాటు ఐదురోజులుగా సూచీల ర్యాలీ కారణంగా నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మార్కెట్లో మిడ్‌సెషన్ వరకు నష్టాల్లో కొనసాగింది. అయితే అనూహ్యంగా రూపాయి