STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా?

Tuesday 13th November 2018
Markets_main1542080287.png-21914

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

► అమెరికా మార్కెట్లు సోమవారం పతనం కావడం, డాలర్‌ 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం, యూరప్‌లోని రాజకీయ అస్థిరతలు, క్రూడ్‌ ధరలు తగ్గుదల వంటి అంశాల కారణంగా ఆసియా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 32 పాయింట్ల నష్టంతో 3,036 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 131 పాయిం‍ట్ల నష్టంతో 9,699 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 13 పాయింట్ల నష్టంతో 2,617 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 35 పాయింట్ల నష్టంతో 2,045 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 391 పాయింట్ల నష్టంతో 25,242 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 715 పాయింట్ల నష్టంతో 21,554 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

► అమెరికా మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పతనమయ్యాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.32 శాతం లేదా 602 పాయిం‍ట్ల నష్టంతో 25,387 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.97 శాతం లేదా 55 పాయింట్ల నష్టంతో 2,726 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 2.78 శాతం లేదా 206 పాయింట్ల నష్టంతో 7,200 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ నష్టపోవడం ఇండెక్స్‌లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. యాపిల్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ షేర్లు బాగా పడిపోయాయి. యాపిల్‌ షేరు ఏకంగా 5 శాతంమేర పతనమైంది. యాపిల్‌ కంపెనీకి విడిభాగాలను సరఫరా చేసే సంస్థలు వాటి అంచనాలను తగ్గించుకోవడం ఇందుకు కారణం. 

► ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 48 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్ద ఉంది. 

► రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతానికి తగ్గింది. ఇది సెప్టెంబర్‌లో 3.7 శాతంగా నమోదయ్యింది. 

► పారిశ్రామికోత్పత్తి సెప్టెంబర్‌లో 4.5 శాతంగా నమోదయ్యింది. ఆగస్ట్‌లో ఇది 4.7 శాతంగా ఉంది. 

► క్రూడ్‌ ధరల మంగళవారం 1 శాతానికి పైగా తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 70 మార్క్‌ దిగువకు వచ్చేసింది. డబ్ల్యూటీఐ 60 డాలర్ల దిగువకు తగ్గింది. సరఫరాను తగ్గించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒపెక్‌ దేశాలపై ఒత్తిడి తీసుకురావడం ఇందుకు కారణం. బ్రెంట్‌ కూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 69.17 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 59.06 డాలర్ల వద్ద ఉంది. 

► భారత్‌ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో 7.3 శాతానికి (ఇది వరకు 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది) తగ్గొచ్చని యూబీఎస్‌ అంచనా వేసింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ప్రతికూలతలను ఇందుకు కారణంగా పేర్కొంది. 

► అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం 39 పైసలు క్షీణించి 72.89 వద్ద ముగిసింది.

► పీఈ/వీసీ ఇన్వెస్ట్‌మెంట్లు అక్టోబర్‌లో 50 శాతం వృద్ధితో 3.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

► ఆర్‌బీఐ కొన్ని బ్యాంకులకు సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చనే అంచనాలున్నాయి. 

► బెక్టార్స్‌ ఫుడ్స్‌, సన్‌సెరా ఇంజినీరంగ్‌ కంపెనీల ఐపీవోకు సెబీ అనుమతినిచ్చింది.

► దాదాపు 591 కంపెనీలు మంగళవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 



You may be interested

నష్టాల్లో మార్కెట్లు

Tuesday 13th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,482 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,812 పాయింట్లతో పోలిస్తే 34 పాయింట్ల లాభంతో 34,846 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 9:18 సమయంలో సెన్సెక్స్‌ 58 పాయింట్ల నష్టంతో 34,754

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Tuesday 13th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 48 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,503 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక

Most from this category