News


స్టాక్‌ మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Wednesday 19th December 2018
Markets_main1545190535.png-23054

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 39 పాయింట్ల లాభంతో 10,994 పాయింట్ల వద్ద ఉంది. 

♦ ఇండియా వోలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 4.32 శాతం క్షీణతతో 14.50 స్థాయికి క్షీణించింది. వీఐఎక్స్‌ గత ఐదు సెషన్లలో 32 శాతం మేర పతనమైంది. ఇది మార్కెట్‌పై బుల్స్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోంది. 

♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు ఫెడరల్‌ రిజర్వును హెచ్చరించారు. వడ్డీ రేట్లు పెంచి మళ్లీ తప్పు చేయవద్దని పేర్కొన్నారు. 

♦ క్రూడ్‌ ఆయిల్‌ ధర మంగళవారం ఏకంగా 5 శాతం మేర క్షీణించింది. ఓవర్‌ సప్లై, డిమాండ్‌ తగ్గుదల భయాలు, అమెరికాలో నిల్వలు పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 46.24 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 56.26 డాలర్ల వద్ద కదలాడుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 

♦ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో వీక్లి ఆప్షన్స్‌ ప్రారంభించేందుకు ఎన్‌ఎస్‌ఈకి సెబీ ఆమోదం తెలిపింది. 

♦ ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 18న ఏకంగా 112 పైసలు మేర లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.44 వద్ద క్లోజయ్యింది. రూపాయి ఐదేళ్లలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.

♦ కార్పొరేట్‌ బాం‍డ్లకు వ్యాల్యుయేషన్‌ నిబంధనలను అమలు పరిచేందుకు సెబీ రెడీ అవుతోంది.

♦ లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ రైట్‌ షేర్లను (డీవీఆర్‌) తిరిగి ప్రారంభించేందుకు సెబీ ఒక కమిటీని వేసింది. 

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 9 పాయింట్ల లాభంతో 3,055 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 31 పాయింట్ల లాభంతో 9,750 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల నష్టంతో 2,567 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల లాభంతో 2,074 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 1 పాయింటు నష్టంతో 25,813 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225... 90 పాయింట్ల నష్టంతో 21,025 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో క్లోజయ్యాయి. ఇండెక్స్‌లు స్వల్పంగా పెరిగాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.35 శాతం లేదా 83 పాయిం‍ట్ల లాభంతో 23,675 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.01 శాతం లేదా 0.22 పాయింటు లాభంతో 2,546 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.45 శాతం లేదా 30 పాయింట్ల లాభంతో 6,783 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ప్రభుత్వాన్ని పాక్షికంగా ముసివేయడానికి అవకాశముందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మరో వైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయం నేడు అర్ధ రాత్రి వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.  

 



You may be interested

మార్కెట్‌కు రూపీ, క్రూడ్‌ బూస్ట్‌..

Wednesday 19th December 2018

10,950 పైకి నిఫ్టీ సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ జోరుమీదుంది. గత రెండు రోజూలు లాభాల్లో ముగిసిన ఇండెక్స్‌లు బుధవారం కూడా గ్యాప్‌అప్‌తోనే ప్రారంభమయ్యాయి. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,908 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,347 పాయింట్లతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో 36,441 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Wednesday 19th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:37 సమయంలో 39 పాయింట్ల లాభంతో 10,994 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,935 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category