STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Monday 12th November 2018
Markets_main1541993794.png-21878

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,070 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 14 పాయిం‍ట్ల లాభంతో 9,844 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల లాభంతో 2,606 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల నష్టంతో 2,082 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 106 పాయింట్ల లాభంతో 25,708 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 34 పాయింట్ల లాభంతో 22,284 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ క్రూడ్‌ ధర తగ్గడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా అమెరికా స్టాక్‌ మార్కెట్‌ పడిపోయింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు దాదాపు 1 శాతంమేర క్షీణించాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.77 శాతం లేదా 202 పాయిం‍ట్ల నష్టంతో 25,989 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయింది. చివరకు కొంత కోలుకుంది. క్యాటర్‌పిల్లర్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.92 శాతం లేదా 26 పాయింట్ల నష్టంతో 2,781 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కన్సూమర్‌ డిస్క్రీషనరీ, టెక్నాలజీ స్టాక్స్‌ నష్టపోవడం ఇందుకు కారణం. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 1.65 శాతం లేదా 124 పాయింట్ల నష్టంతో 7,406 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ వంటి స్టాక్స్‌ నష్టపోవడం ఇందుకు కారణం. క్రూడ్‌ ధరలు మరింత తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలు మొదలయ్యాయి. చైనా వాహన విక్రయాల గణాంకాలు నిరుత్సాహపరచడం కూడా వాల్‌స్ట్రీట్‌ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోన్న సాంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఫెడరల్‌ రిజర్వు.. వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలివ్వడం కూడా నెగటివ్‌ ప్రభావం చూపింది. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 18 పాయింట్ల నష్టంతో 10,604 పాయింట్ల వద్ద ఉంది. 

♦ అమెరికాతో వాణిజ్య చర్చలకు చైనా తలుపులు తెరిచింది.

♦ దేశీ ఫారెక్స్‌ నిల్వలు నవంబర్‌ 2తో ముగిసిన వారంలో 1.05 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 393.13 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 

♦ క్రూడ్‌ ధర సోమవారం 1 శాతంమేర పెరిగింది. డిసెంబర్‌ క్రూడ్‌ సరఫరాలో కోత ఉండొచ్చని సౌదీ అరేబియా ప్రకటించడం ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 1.3 శాతం పెరుగుదలతో 71.11 డాలర్లకు పెరిగింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 0.9 శాతం పెరుగుదలతో 60.73 డాలర్లకు ఎగసింది. 

♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 9న 50 పైసలు బలపడి 72.50 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో ఎగుమతిదారులు డాలర్లను విక్రయిండచం ఇందుకు కారణం.

♦ విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు రూ.4,800 కోట్ల మేర నిధులను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. రూపాయి పెరుగుదల, క్రూడ్‌ ధరల తగ్గుదల సానుకూల ప్రభావం చూపాయి. 

♦ దాదాపు 371 కంపెనీలు సోమవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇందులో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, ఎన్‌ఎండీసీ, ఆయిల్‌ ఇండియా, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జైన్‌ ఇరిగేషన్‌ వంటి పలు కంపెనీలు ఉన్నాయి. 



You may be interested

లాభాల బోణి

Monday 12th November 2018

10,600 మార్క్‌కు పైన నిఫ్టీ సెన్సెక్స్‌ 130 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,585 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,607 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,158 పాయింట్లతో పోలిస్తే 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధర

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 12th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 18 పాయింట్ల నష్టంతో 10,604 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,623 పాయింట్లతో పోలిస్తే 19 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ఉన్నాయి. కొస్పి,

Most from this category