STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Monday 27th August 2018
Markets_main1535342389.png-19655

నిప్టీ శుక్రవారం నష్టాల్లోనే ముగిసింది. డైలీ క్యాండిల్‌ స్టిక్‌ చార్ట్స్‌లో ఇన్‌డెసిసివ్‌ డోజి ప్యాట్రన్‌ను ఏర్పరచింది.
వారంగా చూస్తే బుల్లిష్‌ క్యాండిల్‌ను  ఏర్పరచింది. నిఫ్టీ 50 శుక్రవారం 11,566 వద్ద​ప్రారంభమైంది. 11,604 పాయింట్లకు పెరిగింది. తర్వాత లాభాలు ఆవిరై 11,532 పాయింట్ల స్థాయికి క్షీణించింది. చివరకు 26 పాయింట్ల నష్టంతో 11,557 వద్ద క్లోజయ్యింది. వారంగా చూస్తే నిఫ్టీ 0.75 శాతం పెరిగింది. 
వీఐఎక్స్‌ 3.35 శాతం క్షీణతతో 12.33 స్థాయికి తగ్గింది. అంటే తక్కువ ఒడిదుడుకులు మార్కెట్‌ పడిపోతున్నప్పుడు బుల్స్‌ మద్దతునివ్వొచ్చు.
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,524, 11,491 స్థాయిల వద్ద కీలకమైన మద్దతు లభిస్తుంది. ఇక 11,597, 11,637 కీలక నిరోధ స్థాయిలు.
బ్యాంక్‌ నిఫ్టీ శుక్రవారం 193 పాయింట్ల నష్టంతో 27,834 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,704, 27,573 కీలక మద్దతు స్థాయిలు. ఇక 28,044, 28,253 కీలక నిరోధ స్థాయిలు.
సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ రేట్ల పెంపు కొనసాగుతుందని సంకేతాలివ్వడం సానుకూల ప్రభావం చూపింది. దీంతో అమెరికా మార్కెట్లు జోరు పెంచాయి. మూడు ప్రధాన ఇండెక్స్‌లలో రెండు శుక్రవారం కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఎస్‌అండ్‌పీ 500 ఎట్టకేలకు జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. జనవరి 26 నాటి తన రికార్డ్‌ స్థాయిని అధిగమించడానికి ఇండెక్స్‌కు ఏడు నెలలు పట్టింది. మరోవైపు నాస్‌డాక్‌ ఇండెక్స్‌, స్మాల్‌ స్టాక్స్‌ రస్సెల్‌ 2000 ఇండెక్స్‌లు కూడా శుక్రవారం రికార్డ్‌ స్థాయిల వద్ద ముగిశాయి. డౌజోన్స్‌ మాత్రం తన జనవరి 26 నాటి రికార్డ్‌ స్థాయి కన్నా దిగువునే ఉంది. టెక్నాలజీ, మెటీరియల్స్‌ షేర్లు లాభపడటం వల్ల ఎస్‌అండ్‌పీ 500 శుక్రవారం 0.6 శాతం పెరుగుదలతో 2,874.69 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌కు ఇది జీవిత కాల గరిష్ట స్థాయి. ఎస్‌అండ్‌పీ 500 చివరిగా జవనరి 26న 2,872.87 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 67 పాయింట్ల లాభంతో 7,945 వద్ద ముగిసింది. దీంతో ఇండెక్స్‌ తన జూలై 25 నాటి 7932 పాయింట్ల గరిష్ట స్థాయిని అధిగమించింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 133 పాయింట్ల లాభంతో 25,790 వద్ద ముగిసింది. అయితే ఈ ఇండెక్స్‌ తన జనవరి 26 నాటి గరిష్ట స్థాయి కన్నా దిగువునే ఉంది. స్మాల్‌ స్టాక్స్‌ రస్సెల్‌ 2000 ఇండెక్స్‌ కూడా 1,726 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో ముగిసింది.
♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 158 పాయింట్ల లాభంతో 22,759 పాయింట్ల వద్ద ఉంది. ఇక హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 512 పాయింట్ల లాభంతో 28,184 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు లాభంతో 2,294 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 56 పాయిం‍ట్ల లాభంతో 10,865 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 31 పాయింట్ల లాభంతో 2,760 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింట్ల లాభంతో 3,231 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కూడా పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ శుక్రవారం జాక్సన్‌ హోల్‌లో జరిగిన పాలసీ నిర్ణేతల వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బలంగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీని రక్షించేందుకు, ఉద్యోగాల సృష్టిని కొనసాగించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు వడ్డీ రేట్ల పెంపు సరైన అయుద్ధమని పేర్కొన్నారు. అందువల్ల వడ్లీ రేట్లను క్రమంగా పెంచుకుంటూ వెళ్తామని సాంకేతాలిచ్చారు. 
♦ దేశీయ విదేశీ మారక నిల్వలు ఆగస్టు 17తో ముగిసిన వారంలో 33.2 మిలియన్ డాలర్ల మేర తగ్గి 400.847 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
♦ విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. వీళ్లు ఆగస్ట్‌ నెలలో ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లోకి రూ.6,700 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశారు. 
♦ రూపాయి శుక్రవారం రికవరీ అయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ఇండియన్ మార్కెట్‌లో 20 పైసలు బలపడి 69.91 వద్ద ముగిసింది. 
♦ ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) నిధుల సంరక్షణ చర్యల్లో భాగంగా 70 విదేశీ శాఖల మూసివేత లేదా క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేశాయి.
♦ సెక్యూరిటీస్‌ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌ (ఎస్‌ఎల్‌బీ) సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగిస్తున్నామని సెబీ పేర్కొంది.
♦ ఆఫ్‌షోర్‌ ఇండియా ఫండ్స్‌, ఈటీఎఫ్‌ల నుంచి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలో ఏకంగా 2 బిలియన్‌ డాలర్లు వెనక్కు వెళ్లాయని మార్నింగ్‌స్టార్‌ నివేదిక పేర్కొంది. You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 27th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జెనీసెస్‌ కలర్స్‌లో అదనంగా 3.07శాతం వాటాను రూ.8.32కోట్లను కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుతో జెనీసెస్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మొత్తం వాటాను 49.46శాతానికి పెంచుకుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ.1000 కోట్లను, గ్రీన్‌షూ​ఆప్షన్‌ పద్దతి ద్వారా మరో రూ.1000 కోట్లను మొత్తం 2వేల కోట్ల సమీకరణకు బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఫోర్టిస్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 49 పాయింట్లు అప్‌

Monday 27th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభలతో ట్రేడవుతోంది. ఉదయం 8:56 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 49 పాయింట్ల లాభంతో 11,623 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,571 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే

Most from this category