STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 5th September 2018
Markets_main1536119768.png-19953

నిప్టీ మంగళవారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలను కొనసాగించింది. ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 11,500 మార్క్‌కు దిగువకు కూడా పడిపోయింది. క్రూడ్‌ ధరలు పెరగడం, రూపాయి 71.57 కనిష్టానికి పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపాయి. ఇండెక్స్‌ డైలీ చార్ట్స్‌లో బేరిస్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. 
ఐటీ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. బ్యాంక్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా ఇండెక్స్‌లు 2 శాతం వరకు క్షీణించాయి. అయితే కేవలం ఐటీ మాత్రం 2 శాతంమేర బలపడింది. 
నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 2.5 శాతానికిపైగా పతనమయ్యాయి.
నిఫ్టీ-50 ప్రారంభం నుంచే ఒదిదుడుకుల్లో ఉంది. 11,598 వద్ద ప్రారంభమైంది. చివరకు 62 పాయిట్ల క్షీణతతో 11,520 వద్ద క్లోజయ్యింది.  
ఇండియా వీఐఎక్స్‌ 2.87 శాతం పెరుగుదలతో 13.87కు పెరిగింది. ఇది ఒడిదుడుకులను సూచిస్తోంది. 

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 12 పాయింట్ల క్షీణతతో 25,952 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 4 పాయింట్ల క్షీణతతో 2,896 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 18 పాయింట్ల క్షీణతతో 8,091 పాయింట్ల వద్ద ముగిశాయి. వాణిజ్య ఉద్రిక్తతలు సహా ఫేస్‌బుక్‌, నైక్‌ షేర్లు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్‌ గణాంకాలు బాగున్నప్పటికీ మార్కెట్లు క్షీణించాయి. అయితే నష్టాలు పరిమితమయ్యాయి. 
♦ ఒక్క తైవాన్‌ ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 65 పాయింట్ల నష్టంతో 22,631 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 436 పాయింట్ల నష్టంతో 27,537 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 5 పాయింట్ల నష్టంతో 2,311 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 15 పాయింట్ల నష్టంతో 3,195 పాయింట్ల వద్ద,  చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 17 పాయింట్ల క్షీణతతో 2,734 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 7 పాయిం‍ట్ల లాభంతో 11,028 పాయింట్ల వద్ద ఉంది.  
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కూడా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦మంగళవారం ఒక్కసారిగా పెరిగిన ముడి చమురు ధరలు బుధవారం తగ్గాయి. అమెరికా గల్ఫ్‌ తీరంలో తుపాను ప్రభావం ముందు ఊహించినంత బలంగా లేకపోవడం ఇందుకు కారణం.
♦అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి 71.58 వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి. 
♦ఇండియన్‌ కంపెనీలు వాటి ఓవర్సీస్‌ వెంచర్లలో చేసే పెట్టుబడులు ఈ ఏడాది జూలైలో 36 శాతం క్షీణతతో 1.39 బిలయన్‌ డాలర్లకు తగ్గాయి. 
♦అమెజాన్‌ 1 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించింది. 
♦క్రాస్‌ కరెన్సీ డెరివేటివ్‌ల లావాదేవీలపై ఫీజు తొలగింపును వచ్చే ఏడాది ఆగస్టు వరకూ పొడిగిస్తున్నామని బాంబే స్టాక్‌  ఎక్స్చేంజ్‌ (బీఎస్‌ఈ) తెలిపింది. 
♦ఫైనాన్షియల్‌ మార్కెట్లపై భారీ స్థాయిలో సైబర్‌ దాడులు జరిపే ప్రమాదముందని ఎన్‌ఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది.You may be interested

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 5th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సీఈఎస్‌ లిమిటెడ్‌:- 1:27 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. అందుకు రికార్డు తేదిని సెప్టెంబర్‌ 21గా నిర్ణయించింది. గోల్డియం ఇంటర్నేషనల్‌:- ఇంటర్నేషనల్‌ క్లయింట్ల నుంచి రూ.140 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఏబిబి ఇండియా:- సెప్టెంబర్‌ 4న కంపెనీ రూ.లక్ష ముఖ విలువ కలిగిన 600 అన్‌సెక్యూర్డ్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంజర్లను జారీ చేసింది. ఇమామి ఇన్ఫ్రాస్టక్చర్స్‌:- సెప్టెంబర్‌ 27న సంస్థ

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు డౌన్‌

Wednesday 5th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:56 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 46 పాయింట్ల నష్టంతో 11,537 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో మంగళవారం నాటి ముగింపు 11,573 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే

Most from this category