STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 29th August 2018
Markets_main1535514299.png-19733

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆగస్ట్‌ 28న కొత్త గరిష్ట స్థాయిలకు చేరింది. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు ఇందుకు కారణం. నిప్టీ-50 కొత్త గరిష్ట స్థాయి 11,760ని తాకింది. అయితే ప్రాఫిట్‌ బుకింగ్‌ వల్ల తిరిగి ప్రారంభ స్థాయి సమీపంలోకే వచ్చింది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో డోజి రకపు క్యాండిల్‌ను ఏర్పరచింది. 
నిఫ్టీ-50 మంగళవారం 11,750 మార్క్‌ను అధిగమించింది. 11,760 పాయింట్ల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. దీంతో ఇండెక్స్‌ 11,700 సమీపంలోకి వచ్చింది. అయితే బుల్స్‌ వల్ల ఇండెక్స్‌ ప్రారంభ స్థాయి 11,731 సమీపంలోకి వచ్చింది. చివరకు 46 పాయింట్ల లాభంతో 11,738 వద్ద ముగిసింది. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,712, 11,686 స్థాయిల వద్ద కీలకమైన మద్దతు లభిస్తుంది. ఇక 11,762, 11,786 కీలక నిరోధ స్థాయిలు.
బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం 5 పాయింట్ల లాభంతో 28,269 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 28,152, 28,034 కీలక మద్దతు స్థాయిలు. ఇక 28,388, 28,506 కీలక నిరోధ స్థాయిలు.
బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క చైనా మాత్రం 6 పాయింట్ల స్వల్ప క్షీణతతో 2,772 పాయింట్ల వద్ద ఉంది. ఇక జపాన్‌ నికాయ్‌ 225.. 155 పాయింట్ల లాభంతో 22,968 పాయింట్ల వద్ద ఉంది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 43 పాయింట్ల లాభంతో 28,394 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల లాభంతో 2,306 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 75 పాయిం‍ట్ల లాభంతో 11,064 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 3 పాయింట్ల లాభంతో 3,251 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
♦ అమెరికా మార్కెట్‌ మంగళవారం స్వల్ప లాభంతో అక్కడక్కడే ముగిసింది. అయినా కూడా ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌లు గరిష్ట ముగింపు స్థాయిలను నమోదు చేశాయి. ఎస్‌అండ్‌పీ 500 కేవలం 1 పాయింటు పెరుగుదలతో 2,898 పాయింట్ల వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 12 పాయింట్ల లాభంతో 8,030 వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 14 పాయింట్ల లాభంతో 26,064 వద్ద ముగిసింది. మార్కెట్‌లో టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌ పెరిగితే.. ఎనర్జీ, టెలికం, మెటీరియల్స్‌ స్టాక్స్‌ తగ్గాయి. 
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ అమెరికా, మెక్సికో దేశాలు ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సవరణలకు అంగీకరించాయి. ఇప్పుడు కెనడా కూడా ఈ ఒప్పందంలో భాగస్వామి అవ్వడానికి అమెరికాతో చర్చలు జరపనుంది. 
♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది.
♦ ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్‌కు వెలుపల ఉన్న దేశాల్లో ఉత్పత్తి పెరగడం వల్ల ధరలు అక్కడక్కడే ఉన్నాయి.
♦ కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరడటం, రూపాయి క్షీణత వల్ల కార్పొరేట్‌ రుణ వ్యయాలు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. అదే సమయంలో ఫారెక్స్‌ నిల్వలు కూడా తగ్గుతాయని తెలిపింది.
♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 6 పైసలు బలపడి 70.10 వద్ద ముగిసింది.You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 29th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఇంటెక్‌ క్యాపిటెక్‌:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సంజీవ్‌ గోయెల్‌ తిరిగి నియమితులయ్యారు. ఆర్‌ఎంజీ అల్లో స్టీల్‌:- బోర్డు ఆఫ్‌ ఛైర్మన్‌గా బి.కె. గోయెంకా నియమితులయ్యారు. సైబర్‌స్కేప్‌ మల్టీమీడియా:- మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎస్‌కే ఆనంద్‌ నియమితులయ్యారు. అస్ట్రాన్‌ ఇంజనీరింగ్‌ ఎలక్ట్రానిక్స్‌:-  థైసెన్‌క్రుప్‌ ఇండియా విభాగం నుంచి రూ.15 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. జై ప్రకాష్‌ పవర్‌:- కంపెనీ రుణదాతలకు కంపల్సెరీ కన్వర్టబుల్‌ ఫ్రిఫరెన్స్‌ షేర్ల ద్వారా రూ.4వేల

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 29th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:40 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,746 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,705 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ బుధవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు చైనా మినహా

Most from this category