STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా?

Thursday 13th December 2018
Markets_main1544672325.png-22872

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

≈ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 48 పాయింట్ల లాభంతో 10,836 పాయింట్ల వద్ద ఉంది. 

≈ రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.3 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్‌లో ఇది 3.31 శాతంగా నమోదయ్యింది. గతేడాది నవంబర్‌లో 4.88 శాతంగా ఉంది. 

≈ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అక్టోబర్‌లో 8.1 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఇది 4.5 శాతం. 

≈ ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 12న అమెరికా డాలర్‌తో పోలిస్తే 16 పైసలు క్షీణించి 72.01 వద్ద ముగిసింది. 

≈ క్రూడ్‌ ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. వాషింగ్టన్‌- బీజింగ్‌ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల భయాలు తగ్గడం, అమెరికాలో ఇన్వెంటరీలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణం. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 51.27 డాలర్ల వద్ద ఉంది. 

≈ ఒత్తిడితో కూడిన డెట్‌, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్స్‌కు సంబంధించిన పోర్ట్‌ఫోలియోలను వేరు చేయడానికి అనుమతించాలని సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

≈ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ను 2020లో ఐపీవోకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీవో విలువ రూ.4,500 కోట్లు ఉండొచ్చు.

≈ నవంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.1.4 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. 

≈ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 9 పాయింట్ల లాభంతో 3,108 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 9,846 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 31 పాయింట్ల లాభంతో 2,633 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 20 పాయింట్ల లాభంతో 2,102 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 374 పాయింట్ల లాభంతో 26,561 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 కూడా ఏకంగా 215 పాయింట్ల లాభంతో 21,818 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

≈ అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.64 శాతం లేదా 157 పాయిం‍ట్ల లాభంతో 24,527 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.54 శాతం లేదా 14 పాయింట్ల లాభంతో 2,651 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.95 శాతం లేదా 66 పాయింట్ల లాభంతో 7,098 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా- చైనా వాణిజ్య సంబంధాలపై సానుకూల అంచనాలు పాజిటివ్‌ ప్రభావం చూపాయి.



You may be interested

మళ్లీ లాభాల ప్రారంభం

Thursday 13th December 2018

10,800 మార్క్‌కు పైన నిఫ్టీ 36,000 పైకి సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,737 పాయింట్లతో పోలిస్తే 73 పాయింట్ల లాభంతో 10,810 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,779 పాయింట్లతో పోలిస్తే 245 పాయింట్ల లాభంతో 36,024 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.   రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.3 శాతానికి దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అక్టోబర్‌లో

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 13th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 48 పాయింట్ల లాభంతో 10,836 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,783 పాయింట్లతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category