STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా?

Thursday 29th November 2018
Markets_main1543463222.png-22462

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 96 పాయింట్ల లాభంతో 10,811 పాయింట్ల వద్ద ఉంది. 

♦ భారత్‌ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.6 శాతానికి తగ్గొచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇండస్ట్రీయల్‌ యాక్టివిటీ నెమ్మదించడం ఇందుకు కారణమని తెలిపింది. జూన్‌ క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. 

♦ ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 28న అమెరికా డాలర్‌తో పోలిస్తే 17 పైసలు బలపడి 70.62 వద్ద ముగిసింది. 

♦ స్టార్టప్స్‌ లిస్టింగ్‌ కోసం బీఎస్‌ఈ తన ఎస్‌ఎంఈ విభాగంలో కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 

♦ దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కు తీసుకుంటారు. దాదాపు 19 నెలల తర్వాత నవంబర్‌లో డీఐఐలు నికర విక్రయదారులుగా ఉన్నారు. 2017 మార్చి నుంచి చూస్తే డీఐఐలు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ఇదే తొలిసారి. డీఐఐలు నవంబర్‌లో ఇప్పటి దాకా రూ.1,368 కోట్లను వెనక్కు తీసుకున్నారు. 

♦ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2019 ఫిబ్రవరి 1న 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైంది. 

♦ ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం అంచనా వేసిన దానికన్నా ఎక్కువగానే ఉండొచ్చని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే తెలిపారు.

♦ క్రూడ్‌ ధరలు గురువారం 1 శాతం మేర పెరిగాయి. అమెరికా క్రూడ్‌ నిల్వలు పెరగడం, వచ్చే వారంలోని ఒపెక్‌ దేశాల సమావేశం నేపథ్యంలో మార్కెట్‌పై ఒత్తిడి నెలకొని ఉంది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 50.94 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 59.36 డాలర్ల వద్ద ఉంది. 

♦ ఒక్క హాంగ్‌ సెంగ్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 27 పాయింట్ల లాభంతో 3,121 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 52 పాయింట్ల లాభం 9,936 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల లాభంతో 2,604 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల లాభంతో 2,120 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 59 పాయింట్ల నష్టంతో 26,623 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 201 పాయింట్ల లాభంతో 22,378 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు బుధవారం బాగా లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.5 శాతం లేదా 617 పాయిం‍ట్ల లాభంతో 25,366 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.3 శాతం లేదా 62 పాయింట్ల లాభంతో 2,743 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.95 శాతం లేదా 209 పాయింట్ల లాభంతో 7,291 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తటస్థ స్థాయికి దగ్గరిలో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల భవిష్యత్‌లో రేట్ల పెంపులో వేగం ఉండకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి.  



You may be interested

ఆరంభం అదిరింది..

Thursday 29th November 2018

10,800 పాయింట్లకు పైన నిఫ్టీ 36,000 సమీపంలో సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,728 పాయింట్లతో పోలిస్తే 80 పాయింట్ల లాభంతో 10,808 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,716 పాయింట్లతో పోలిస్తే 281 పాయింట్ల లాభంతో 35,997 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. భారత్‌ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.6 శాతానికి తగ్గొచ్చని యాక్సిస్‌

నిఫ్టీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌!!

Thursday 29th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 96 పాయింట్ల లాభంతో 10,811 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,717 పాయింట్లతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

Most from this category