STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా?

Friday 14th December 2018
Markets_main1544759125.png-22906

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:52 సమయంలో 43 పాయింట్ల నష్టంతో 10,783 పాయింట్ల వద్ద ఉంది.  

♦ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ బోర్డు శుక్రవారం తొలిసారి సమావేశం కాబోతోంది.  

♦ క్రూడ్‌ ధరలు గురువారం 2 శాతానికి పైగా పెరిగాయి. అమెరికాలో నిల్వలు తగ్గడం, గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్‌లో లోటు ఏర్పడవచ్చనే అంచనాలు ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 2.16 శాతం వృద్ధితో 61.45 డాలర్ల వద్ద, అమెరికా డబ్ల్యూటీఐ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర 2.8 శాతం వృద్ధితో బ్యారెల్‌కు 52.58 డాలర్ల వద్ద కదలాడుతోంది. 

♦ ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 13న 33 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.68 వద్ద ముగిసింది. 

♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.30,000 కోట్ల మూలధనాన్ని అందించాలని కేంద్రం భావిస్తోంది. 

♦ ఎఫ్‌పీఐ ఇన్వెస్ట్‌మెంట్‌ పరిమితుల నిబంధనలను మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ సరళీకరించింది. 

♦ హెచ్‌డీఎఫ్‌సీ బాండ్ల ఇష్యూ ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించనుంది. 

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 38 పాయింట్ల నష్టంతో 3,072 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 123 పాయింట్ల నష్టంతో 9,735 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 19 పాయింట్ల నష్టంతో 2,614 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 26 పాయింట్ల నష్టంతో 2,069 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 369 పాయింట్ల నష్టంతో 26,155 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 కూడా ఏకంగా 377 పాయింట్ల నష్టంతో 21,439 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరజ్‌ లాభాల్లో.. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు నష్టాల్లో క్లోజయ్యాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.29 శాతం లేదా 70 పాయిం‍ట్ల లాభంతో 24,597 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.02 శాతం లేదా 0.53 పాయింటు నష్టంతో 2,650 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.39 శాతం లేదా 28 పాయింట్ల నష్టంతో 7,070 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉండటం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. డిఫెన్సివ్‌ స్టాక్స్‌ లాభపడితే.. ఫైనాన్షియల్‌, కన్సూమర్‌ డిస్క్రీషనరీ స్టాక్స్‌ ఎక్కువగా నష్టపోయాయి. 

♦ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఎస్‌ఎస్‌ఈ తాజాగా రిస్క్‌ రిడక‌్షన్‌ మోడ్‌ అనే నిబంధనను తీసుకువచ్చింది. ఇందులో ట్రేడర్ల క్యాపిటల్‌లో 90 శాతాన్ని మార్జిన్లకు కేటాయించినప్పుడు ఆ సభ్యులు రిస్క్‌ రిడక‌్షన్‌ మోడ్‌లో ఉంటారని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ట్రేడర్‌ రిస్క్‌ రిడక‌్షన్‌ మోడ్‌లో ఉన్నప్పుడు అన్‌ఎగ్జిక్యూటెడ్‌ ఆర్డర్లన్నీ క్యాన్సల్‌ అవుతాయి. ఇది డిసెంబర్‌ 17 నుంచి అమల్లోకి వస్తుంది.  



You may be interested

నెగటివ్‌ ఓపెనింగ్‌

Friday 14th December 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,791 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో 10,784 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,929 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 35,960 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే తర్వాత సెన్సెక్స్‌ కూడా నష్టాల్లోకి వచ్చేసింది. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 10,771 వద్ద,

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 14th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:52 సమయంలో 43 పాయింట్ల నష్టంతో 10,783 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,824 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category