STOCKS

News


మార్కెట్‌ ఎటు వైపు?

Thursday 6th September 2018
Markets_main1536205340.png-19990

నిఫ్టీ బుధవారం నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా అదే ట్రెండ్‌తో నడిచింది. ఇంట్రాడేలో రూపాయి 71.96 కనిష్ట స్థాయిని తాకడంతో నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాలు మరింత పెరిగాయి. అయితే రూపాయి మళ్లీ కొంత రికవరీ చెందటంతో ఇండెక్స్‌ నష్టాలు చివరి గంటలో తగ్గాయి. 
నిఫ్టీ ఇండెక్స్‌కు 11,400 వద్ద కీలక మద్దతు లభించింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది హ్యామర్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి ఉంది.  
నిఫ్టీ-50 బుధవారం 11,514 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 11,542 గరిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత ఇండెక్స్‌ 11,400 స్థాయి దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 11,393 కనిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు 43 పాయింట్ల క్షీణతతో 11,477 వద్ద క్లోజయ్యింది. చివరి గంటలో షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకుంది. అందువల్ల నష్టాలు తగ్గాయి. 
ఇండియా వీఐఎక్స్‌ 1.03 శాతం తగ్గుదలతో 13.64కి క్షీణించింది. అంటే మద్దతు స్థాయిల వల్ల కన్సాలిడేట్‌ జరగొచ్చు. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,399, 11,322 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,548, 11,620 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
బ్యాంక్‌ నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 27,376 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,172, 26,969 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 27,542, 27,709 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 22 పాయింట్ల లాభంతో 25,975 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 8 పాయింట్ల క్షీణతతో 2,888 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 96 పాయింట్ల క్షీణతతో 7,995 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ షేర్లు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. వీటికి నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లలో అధిక వెయిటేజీ ఉంది. 
♦ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 52 పాయింట్ల నష్టంతో 22,528 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 124 పాయింట్ల నష్టంతో 27,119 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,296 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,164 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల లాభంతో 2,713 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల నష్టంతో 10,963 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధంగా లేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే వాణిజ్య చర్చలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. 
♦ఇండియన్‌ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.97 జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. అయితే చివరకు 20 పైసలు రికవరీ అయ్యి 71.75 వద్ద ముగిసింది.
♦క్రూడ్‌ ధరలు గురువారం తగ్గాయి. వర్ధమాన మార్కెట్ల ఆందోళనలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అలాగే చైనా దిగుమతులపై మరో 200 బిలియన్‌ డాలర్ల అమెరికా టారిఫ్‌ల విధింపు గడువు దగ్గరకు వస్తోంది. 
♦రూపాయి విలువ క్షీణించడం అంతర్జాతీయ పరిణామాల వల్లేనని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. దేశీయ కారణాలు ఎంత మాత్రం కాదని పేర్కొన్నారు. ప్రతీ కరెన్సీతోనూ డాలర్‌ బలపడిందని, అంతే కానీ రూపాయి బలహీనపడలేదని తెలిపారు.
♦కొత్త నిబంధనలపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో నెలకొన్న ఆందోళనలను తొలగించడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. వీటిపై ప్రభుత్వం సహా వివిధ వర్గాల అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాతే నిబంధనలను సమీక్షిస్తామని పేర్కొంది.
♦ఏంజెల్‌ బ్రోకింగ్‌ రూ.600 కోట్ల ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. 



You may be interested

లాభాల ఆరంభం

Thursday 6th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,018 పాయింట్లతో పోలిస్తే 144 పాయింట్ల లాభంతో 38,162 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,477 పాయింట్లతో పోలిస్తే 37 పాయింట్ల లాభంతో 11,514 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు అప్‌

Thursday 6th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:38 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 11,536 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో బుధవారం నాటి ముగింపు 11,518 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా

Most from this category