STOCKS

News


మార్కెట్‌పై వీటి ప్రభావం..

Thursday 30th August 2018
Markets_main1535600539.png-19772

నిప్టీ-50 బుధవారం ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. తర్వాత రోజంతా ఒక రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. చివరకు నష్టా‍ల్లో ముగిసింది. 11,700 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఇండెక్స్‌ డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. గురువారం రోజు ఆగస్ట్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉన్న విషయం తెలిసిందే. 
నిఫ్టీ-50 బుధవారం 11,745 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. చివరకు 47 పాయింట్ల క్షీణతతో 11,691 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11,679 పాయింట్లు కనిష్ట స్థాయిని, 11,753 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇండెక్స్‌ 11,600 స్థాయి దిగువకు పడిపోతే మరింత పతనం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ఆగస్ట్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ముగింపు వల్ల గురువారం మార్కెట్‌లో ఒదిదుడుకులు ఉంటాయని పేర్కొన్నారు. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌ కిందకు పడిపోతే 11,662, 11,633 స్థాయిల వద్ద కీలకమైన మద్దతు లభిస్తుంది. అదే పైకి కదిలితే 11,737, 11,782 కీలక నిరోధ స్థాయిలు.
బ్యాంక్‌ నిఫ్టీ బుధవారం 46 పాయింట్ల నష్టంతో 28,224 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌ కిందకు పడిపోతే 28,146, 28,069 కీలక మద్దతు స్థాయిలు. అదే పైకి కదిలితే 28,322, 28,421 కీలక నిరోధ స్థాయిలు.
గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు వరుసగా నాలుగో సెషన్‌లనూ కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. దీనికి టెక్నాలజీ కంపెనీలు బాగా దోహదపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 61 పాయింట్ల లాభంతో 26,125 వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 17 పాయింట్ల లాభంతో 2,914 వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 80 పాయింట్ల లాభంతో 8,110 వద్ద ముగిశాయి. 
♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల క్షీణతతో 2,760 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 131 పాయింట్ల నష్టంతో 28,285 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 13 పాయింట్ల నష్టంతో 3,231 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక జపాన్‌ నికాయ్‌ 225.. 35 పాయింట్ల లాభంతో 22,884 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 5 పాయింట్ల లాభంతో 2,314 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 4 పాయిం‍ట్ల లాభంతో 11,103 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు తగ్గడం ఇందుకు కారణం. అలాగే ఇరాన్‌, వెనిజుల నుంచి క్రూడ్‌ సరఫరా తగ్గుతుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి. 
♦ రూపాయి బుధవారం 49 పైసలు మేర క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.59 రికార్డ్‌ కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. డాలర్‌ బలమైన డిమాండ్‌ నేపథ్యంలో ఒకానొక సమయంలో 70.65 ఆల్‌టైమ్‌ కనిష్టానికి కూడా పతనమైంది. 
♦ ఇండియా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 7.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని రాయిటర్స్‌ పోల్‌లో వెల్లడయ్యింది. 
♦ ఎఫ్‌పీఐలు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ ఏడాదిలో 280 మిలియన్‌ డాలర్లు వెనక్కు తీసుకున్నారు. అదే సమయంలో డీఐఐలు 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశారు. 
♦ ఎఫ్‌డీఐలకు భారత్‌ గమ్య స్థానంగా కొనసాగుతోందని రిజర్వు బ్యాంక్‌ పేర్కొంది.
♦ కేంద్ర ప్రభుత్వం విలీనానికి అనువైన బ్యాంకులను గుర్తించాలని ఆర్‌బీఐని కోరినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది.
♦ వచ్చే వారంలో అమెరికా అధికారుల భేటీలో ఇరాన్‌ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 



You may be interested

లాభాలు అంతలోనే నష్టాలు

Thursday 30th August 2018

బుధవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ మార్కెట్లు గురువారం పాజిటివ్‌గానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,723 పాయింట్లతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో 38,797 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,692 పాయింట్లతో పోలిస్తే 3 పాయింట్ల స్వల్ప లాభంతో 11,695 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30 సమయంలో సెస్సెక్స్‌ 31 పాయింట్ల

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 30th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:37 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 11,720 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో బుధవారం నాటి ముగింపు 11,707 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన

Most from this category