STOCKS

News


కీలక మద్దతుశ్రేణి 33,900-33,720 పాయింట్లు  

Monday 22nd October 2018
Markets_main1540184153.png-21348

అమెరికా సూచీలు తాజాగా డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లిన కారణంగా మన మార్కెట్లో సాంకేతికంగా జరగాల్సిన రిలీఫ్‌ర్యాలీకి బ్రేకులు పడే ప్రమాదం వుంటుందంటూ గత కాలమ్‌లో ప్రస్తావించినట్లు రిలీఫ్‌ర్యాలీ అర్థాంతరంగానే ముగిసిపోయింది. వారాంతంలో తీవ్ర పతనాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగియనున్నాయి. ఆయా షేర్లలో నెలకొన్న లాంగ్‌, షార్ట్‌ పొజిషన్లకు అనుగుణంగా ప్రధానమైన షేర్లు వచ్చే నాలుగురోజుల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. దీంతో ప్రపంచట్రెండ్‌తో సంబంధం లేకుండా స్టాక్‌ సూచీలు కూడా ఒడుదుడుకులకు లోనుకావొచ్చు. ఇక మన ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
అక్టోబర్‌ 12తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రమేపీ 35,605 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత హఠాత్తుగా 34,140 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 418  పాయింట్ల నష్టంతో 34,316  పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 200 డీఎంఏ సమీపస్థాయివరకూ పెరిగిన తర్వాత పతనం చోటుచేసుకోవడం బుల్స్‌కు ప్రతికూలాంశం.  ఈ వారం సెన్సెక్స్‌ క్షీణత కొనసాగితే 34,140 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభ్యమవుతుండగా, ఈ స్థాయిని కోల్పోతే 33,900-33,720 పాయింట్ల శ్రేణి వద్ద కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే నిలువునా 33,200 పాయింట్ల సమీపానికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మార్కెట్‌ మొదలైనా 34,565 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన ముగిస్తే 34,730 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 34,920 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం వుంటుంది.  

నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 10,180-10,140
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 10,710 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 10,249 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 169 పాయింట్ల నష్టంతో 10,303 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీ క్షీణత కొనసాగితే తొలుత 10,250 పాయింట్ల సమీపంలో చిన్నపాటి మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే  10180-10,140 పాయింట్ల శ్రేణి మధ్య కీలక మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిలోపున వేగంగా 10,000-9,950 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం రెండో మద్దతుశ్రేణిని పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా నిఫ్టీకి 10,380 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 10,435 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన 10,525 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  



You may be interested

స్థిరంగా పసిడి ధర

Monday 22nd October 2018

సోమవారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్సు పసిడి ధర స్థిరంగా 1,230 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఇక్కడ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా పెరిగిన కారణంగా భారత్‌లోని ఎంసీఎక్స్‌లో ఉదయం 9.30 గంటల సమయానికి 10 గ్రాముల పసిడి రూ. 13 తగ్గుదలతో రూ.31,889 వద్ద ట్రేడవుతోంది.   

పర్సిస్టెంట్ లాభం 7 శాతం అప్‌

Monday 22nd October 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 88 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 82.6 కోట్లతో పోలిస్తే 7 శాతం అధికం. ఇక కంపెనీ ఆదాయం రూ. 795 కోట్ల నుంచి రూ. 859 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి కంపెనీని మూడు విభాగాలుగా విభజించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో

Most from this category