STOCKS

News


సెన్సెక్స్‌ కీలక నిరోధం 35,605

Monday 5th November 2018
Markets_main1541393460.png-21700

మన మార్కెట్లో ఏ క్షణంలోనైనా రిలీఫ్‌ ర్యాలీ మొదలయ్యే అవకాశాలు వున్నాయంటూ గత కాలమ్‌లో సూచించిన రీతిలోనే భారీ అప్‌ట్రెండ్‌ జరిగింది. రూపాయి వేగంగా కోలుకోవడం, క్రూడ్‌ ధర భారీగా పతనంకావడం ఈ ర్యాలీకి కారణం అయ్యింది. అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం ముగియవచ్చన్న ఆశాభావం కూడా ఇందుకు సహకరించింది.  అయితే విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు క్రితం వారం సైతం కొనసాగుతూ వచ్చాయి. ఈ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ ఇదేరీతిలో వుంటే, గతవారం మొదలైన షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ మరి ఎంతోదూరం కొనసాగే అవకాశాలు వుండవు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాలూ భారత్‌ మార్కెట్‌కు కీలకమైనవి.  ఇక ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
నవంబర్‌ 2తో ముగిసినవారంలో గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రమేపీ ర్యాలీ జరుపుతూ 35,190 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1663 పాయింట్ల భారీలాభంతో 35,012 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌ ర్యాలీ కొనసాగితే 35,200 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన 35,605 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. రానున్న వారంలో సెన్సెక్స్‌ అప్‌ట్రెండ్‌కు ఈ స్థాయి కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే వేగంగా 35820-35,920 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ మొదలైనా 34,680 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 34,460 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిలోపున ముగిస్తే 34,170 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు.   

నిఫ్టీ కీలక అవరోధం 10,710
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 10,607 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ వేగంగా పెరిగిన తర్వాత, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 523 పాయింట్ల భారీలాభంతో 10,553 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగితే 10,610 పాయింట్ల స్థాయిని తొలుత అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 10,710 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్‌ వుంటుంది. గత అక్టోబర్‌ 17నాటి గరిష్టస్థాయి అయిన ఈ అవరోధ స్థాయి సమీప భవిష్యత్తులో నిఫ్టీ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిని దాటితే 10,760-10,840 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం రెండో నిరోధశ్రేణిని దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మొదలైనా 10,440 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ మద్దతుస్థాయిని కోల్పోతే 10,390 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 10,285 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. 



You may be interested

డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బైటపెట్టలేదు?

Monday 5th November 2018

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. మొండిబాకీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర

సిప్‌ పెట్టుబడులు ఆపకండి 

Monday 5th November 2018

ప్ర: మార్కెట్‌ తగ్గుతున్నప్పుడు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లను కొనసాగించి, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు వాటిని ఆపేయడం ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? -ఇజాజ్‌, హైదరాబాద్‌  జ:  ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) అసలు ఉద్దేశాలు రెండు..మొదటిది,  మీరు క్రమపద్థతిలో ఇన్వెస్ట్‌ చేయడం, రెండోది... మార్కెట్‌ ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం.  రిటైర్మెంట్‌  నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం,

Most from this category