STOCKS

News


మార్కెట్‌ పయనం ఎటు?

Monday 3rd September 2018
Markets_main1535946607.png-19893

నిప్టీ-50 శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. రోజంతా 90 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. చివరకు ఫ్లాట్‌గానే ముగిసింది. ఇండెక్స్‌ గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనూ కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో చిన్న బుల్లిష్‌ క్యాడిల్‌ను, లాంగ్‌ లెగ్గ్‌డ్ డోజి ప్యాట్రన్‌ను ఏర్పరచింది. వీక్లి చార్ట్స్‌లో చూస్తే షూటింగ్‌ స్టార్‌ రకపు ప్యాట్రన్‌ ఏర్పరచింది. ఓపెనింగ్‌ ప్రైస్‌, క్లోజింగ్‌ ప్రైస్‌తో దాదాపు సమానంగా ఉంటే లాంగ్‌ లెగ్గ్‌డ్‌ డోజి ఏర్పడుతుంది. ఇంట్రాడే కదలికలు ఎక్కువగా ఉంటాయి.  
నిఫ్టీ-50 శుక్రవారం 11,676 వద్ద ప్రారంభమైంది. 11,680 వద్ద ముగిసింది. నెగటివ్‌లో ప్రారంభమైన ఇండెక్స్‌ వెంటనే లాభాల్లోకి వచ్చింది. తర్వాత రేంజ్‌బౌండ్‌లో కదలాడింది.  
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే నిఫ్టీ ఇండెక్స్‌ కిందకు పడిపోతే 11,638, 11,595 స్థాయిల వద్ద కీలకమైన మద్దతు లభిస్తుందని మార్కెట్‌ ఎనలిస్ట్‌ సందీప్‌దాస్‌ తెలిపారు. అదే పైకి కదిలితే 11,725, 11,770 కీలక నిరోధ స్థాయిలని పేర్కొన్నారు.
బ్యాంక్‌ నిఫ్టీ శుక్రవారం 41 పాయింట్ల నష్టంతో 28,062 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌ కిందకు పడిపోతే 27,949, 27,836 కీలక మద్దతు స్థాయిలని సందీప్‌దాస్‌ తెలిపారు. అదే పైకి కదిలితే 28,166, 28,269 కీలక నిరోధ స్థాయిలని పేర్కొన్నారు. 
సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అమెరికా-కెనడా మధ్య వాణిజ్య చర్చలు ముగిశాయి. అయితే ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తక్కువ వ్యాల్యూమ్స్‌, టారిఫ్‌ సంబంధిత ఒడిదుడుకులు వల్ల మూడు ప్రధాన ఇండెక్స్‌లలో రెండు లాభాల్లో, ఒకటి నష్టాల్లో క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 22 పాయిం‍ట్ల నష్టంతో 25,965 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500 కేవలం 0.39 పాయింటు లాభంతో 2,901 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 21 పాయింట్ల లాభంతో 8,109 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. కాగా ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు వరుసగా 2,900, 8,100 మార్క్‌లకు పైస్థాయిలోనే ముగిశాయి. 
♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల మళ్లీ పుంజుకుంటాయనే భయాలు, వర్ధమాన కరెన్సీల అస్థిరత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 114 పాయింట్ల నష్టంతో 22,751 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 27,670 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల నష్టంతో 2,311 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 67 పాయిం‍ట్ల నష్టంతో 10,997 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 13 పాయింట్ల నష్టంతో 3,200 పాయింట్ల వద్ద,  చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 23 పాయింట్ల క్షీణతతో 2,702 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో ఇండియన్‌ ఎకానమీ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. గత రెండేళ్లలో ఇదే గరిష్ట వృద్ధి. గత నాలుగళ్లలో కేంద్రం తీసుకున్న సంస్కరణలే ఈ స్థాయి వృద్ధి రేటుకు ‍కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
♦ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ జీడీపీ వృద్ధి 7.5 శాతంగా నమోదు కావొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 
♦తమ ట్రేడ్‌ డిమాండ్లను అంగీకరించకపోతే ‘ఫ్రీ మిలిటరీ ప్రొటెక‌్షన్‌’ను కోల్పవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వాణిజ్య భాగస్వామ్య దేశాలను హెచ్చరించారు. దీంతో కెనడా, యూరోపియన్‌ యూనియన్‌పై ఒత్తిడి నెలకొంది. 
♦వచ్చే త్రైమాసికాల్లో వృద్ధి రేటు గరిష్ట స్థాయిలో ఉండొచ్చని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.
♦ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక పారిశ్రామిక విభాగం వృద్ధి జూలైలో బాగుంది. వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి రేటు కేవలం 2.9 శాతం. కాగా, నెలవారీగా చూస్తే మాత్రం ఎనిమిది పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు తగ్గింది. జూన్‌లో ఈ రేటు 7.6 శాతం. 
♦ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ వల్ల చైనా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని బీజింగ్‌ పర్చేసింగ్‌ మేనేజర్‌ ఇండెక్స్‌ పేర్కొంది.
♦ఒపెక్‌ ఉత్పత్తి పెరుగుదల వల్ల సోమవారం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గాయి.
♦ఆగస్ట్‌ 24తో ముగిసిన వారంలో దేశీ ఫారెక్స్‌ నిల్వలు 445 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 401.29 బిలయన్‌ డాలర్లకు పెరిగాయి.  
♦రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 26 పైసలు క్షీణించి 71 స్థాయిని తాకింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి. 
♦యూరోజోన్‌లో నిరుద్యోగిత దశాబ్ద కాల కనిష్ట స్థాయికి పడిపోయింది. జూలైలో ఇది 8.2 శాతంగా నమోదయ్యింది. 
♦విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. ఆగస్ట్‌ నెలలో రూ.5,100 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. You may be interested

జీడీపీ జోష్‌...గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 3rd September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,645 పాయింట్లతో పోలిస్తే 271 పాయింట్ల లాభంతో 38,916 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో  ప్రారంభమైంది.  నిఫ్టీ తన మునపటి ముగింపు 11,680 పాయింట్లతో పోలిస్తే 71 పాయింట్ల లాభంతో 11,751 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నా, గత శుక్రవారం సాయంత్రం విడుదలైన ప్రోత్సాహకర జీడీపీ డేటా కారణంగా భారత్‌ మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Monday 3rd September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:35 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 11,749 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,735 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో

Most from this category