News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 7th September 2018
Markets_main1536292370.png-20028

నిఫ్టీ గురువారం లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నాం కల్లా లాభాలన్నీ ఆవిరై, నష్టా‍ల్లోకి వెళ్లింది. రూపాయి 72 స్థాయికి పడిపోవడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మళ్లీ చివరి రెండు గంటల్లో ఇండెక్స్‌ పుంజుకొని లాభాల్లో ముగిసింది. 
నిఫ్టీ ఇండెక్స్‌ కీలకమైన 11,500 మార్క్‌కు పైన నిలిచింది. డైలీ చార్ట్స్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది హ్యామర్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి ఉంది.  
నిఫ్టీ-50 గురువారం 11,514 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 11,436 కనిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత ఇండెక్స్‌ 11,562 గరిష్ట స్థాయిని టచ్‌ చేసింది. చివరకు 60 పాయింట్ల లాభంతో 11,536 వద్ద క్లోజయ్యింది. 
ఇండియా వీఐఎక్స్‌ 1.02 శాతం పెరుగుదలతో 13.79కి చేరింది.
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,461, 11,385 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,587, 11,637 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
బ్యాంక్‌ నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 27,468 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,292, 27,115 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 27,598, 27,729 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 20 పాయింట్ల లాభంతో 25,996 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్ల క్షీణతతో 2,878 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 72 పాయింట్ల క్షీణతతో 7,922 పాయింట్ల వద్ద ముగిశాయి. సోషల్‌ మీడియా కంపెనీలపై నిబంధనలు కఠినతరం కావడం, టెక్నాలజీ స్టాక్స్‌ పడిపోవడం, చైనా దిగుమతులపై అమెరికా టారిఫ్‌ భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. 
♦ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 224 పాయింట్ల నష్టంతో 22,264 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 31 పాయింట్ల నష్టంతో 26,943 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,280 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల నష్టంతో 3,126 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 40 పాయిం‍ట్ల నష్టంతో 10,884 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అయితే చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 17 పాయింట్ల లాభంతో 2,708 పాయింట్ల వద్ద ఉంది. చైనాపై అమెరికా కొత్త టారిఫ్‌ భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి.  
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ లేదా ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦రూపాయి వరుసగా ఏడవ సెషన్‌లోనూ పడిపోయింది. గురువారం 71.99 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 72 స్థాయి దిగువకు కూడా పనతమైంది. 
♦అమెరికాలో గతవారం జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ 49 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. ప్రైవేట్‌ ఉద్యోగుల వేతనాలు ఆగస్ట్‌లోనూ పెరిగాయి. లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉందనే విషయాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. 
♦క్రూడ్‌ ధరలు శుక్రవారం పెరిగాయి. అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు తగ్గడం ఇందుకు కారణం. 



You may be interested

లాభాల్లోంచి నష్టాల్లోకి

Friday 7th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,242 పాయింట్లతో పోలిస్తే 72 పాయింట్ల లాభంతో 38,314 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,536 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 11,558 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల నష్టంతో 38,109 వద్ద, నిఫ్టీ

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 7th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:49 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 15 పాయింట్ల లాభంతో 11,559 పాయింట్ల వద్ద ఉంది. అయితే మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో గురువారం నాటి ముగింపు 11,567 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం నెగటివ్‌గా లేదా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా

Most from this category