STOCKS

News


పాజిటివ్‌ ఓపెనింగ్‌

Monday 29th October 2018
Markets_main1540784916.png-21544

గతవారం భారీ నష్టాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 33,550 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల పెరుగుదలతో 10,078 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత శుక్రవారం నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టపోయి, ఏడు నెలల కనిష్టస్థాయి 10,030 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అదేరోజున మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాల్ని ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు తాజాగా 4,2  శాతం పెరుగుదలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రారంభంలో 2 శాతం మేర నష్టపోయాయి. 

మిశ్రమంగా ఆసియా సూచీలు
 సోమవారం ఆసియాలో చైనా, జపాన్‌ సూచీలు మినహా మిగిలిన ప్రధాన సూచీలన్నీ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా షాంఘై ఇండెక్స్‌ 1 శాతం మేర నష్టంతో కదులుతుండగా, జపాన్‌ నికాయ్‌ సూచి 19 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. గత శుక్రవారం రాత్రి అమెరికా సూచీలు 1.5 శాతం వరకూ పతనమయ్యాయి. అమెజాన్, గూగుల్‌ కంపెనీలు వెల్లడించిన ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోవడంతో అక్కడ ఈ షేర్లతో పాటు కొద్ది నెలలుగా పెద్ద ర్యాలీ చేసిన యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్‌ తదితర ఇంటర్నెట్‌ షేర్ల క్షీణత కారణంగా అక్కడ సూచీలు పతనమయ్యాయి. 

 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 29th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..! ఐసీఐసీఐ బ్యాంక్‌:- అదనపు డైర్టెక్టర్‌గా హరి ఎల్‌ ముంద్రా నియమితులయ్యారు. ఈయన బ్యాంకు ఐదేళ్ల పాటు తన సేవలను అందించనున్నారు. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- బెంగళూర్‌లోని కోగిలు రోడ్డులో బ్రిగేడ్‌ బ్రిక్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ:- ప్రస్తుతం సంస్థ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సతీష్‌ కుమార్‌ గుప్తా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శరద్‌ బండారీ నియమితులయ్యారు. కాక్స్‌&కింగ్స్‌:- తన విద్యా వ్యాపారాన్ని బ్రిటన్‌కు చెందిన మిడ్లోథియన్

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 55 పాయింట్లు అప్‌

Monday 29th October 2018

గత శుక్రవారం అమెరికా సూచీలు భారీగా తగ్గినప్పటికీ, సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 గంటల సమయానికి 55 పాయింట్ల పెరుగుదలతో 10,110 పాయింట్ల వద్ద కదులుతోంది. ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గత శుక్రవారం 10,055 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,030 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం ఆసియాలోని

Most from this category