STOCKS

News


స్వల్పలాభాలతో ప్రారంభం

Tuesday 26th March 2019
Markets_main1553571818.png-24794

ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలతో క్రితం రోజు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైన భారత్‌ సూచీలు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 37,884 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,375 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో తిరిగి పీఎస్‌యూ షేర్లే జంప్‌చేసాయి. ఐఓసీ 3 శాతంపైగా పెరగ్గా, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, హింద్‌ పెట్రోలు 2-3 శాతం మధ్య లాభంతో ప్రారంభంకాగా, ఐటీ షేర్లు ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌లు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 26th March 2019

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌:- ఎన్‌సీడీల ద్వారా రూ.600 కోట్లను సమీకరించింది.  టైటాన్‌ కంపెనీ:- కంపెనీ స్వతంత్ర డెరెక్టరుగా ప్రద్యుమ్న రమేష్‌చంద్ర వ్యాస్‌ను నియమించారు.  డీసీఎం:- కంపెనీ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్షియల్‌ పదవికి సుమంత్‌ భరత్‌రామ్‌ రాజీనామా చేశారు. మార్చి 31వ తేది నుంచి రాజీనామా అమల్లోకి రానుంది.  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్:- సంస్థలో తన జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ప్రిడెన్షియల్‌ కార్ప్‌ హోల్డింగ్‌ కంపెనీలో 3.71శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆఫర్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Tuesday 26th March 2019

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నదన్న భయాలతో క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కుదుటపడిన నేపథ్యంలో మంగళవారం పాజిటివ్‌ ఓపెనింగ్‌కు సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 2 పాయింట్ల లాభంతో 11,372 పాయింట్ల వద్ద కదులుతోంది. సోమవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,370  పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు

Most from this category