STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Thursday 28th February 2019
Markets_main1551325797.png-24366

సెన్సెక్స్‌ 120 పాయింట్లు, నిఫ్టీ 59 పాయింట్లు జంప్‌ 

ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ వరుసగా రెండురోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు గురువారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్లు లాభపడి 36,026 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 59 పాయింట్లు జంప్‌చేసి 10,865 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా మోటార్స్‌, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీలు 1 శాతంపైగా పెరగ్గా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, విప్రో, టీసీఎస్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నప్పటికీ,  పూంచ్‌ సెక్టార్‌లో భారత్‌, పాక్‌ల మధ్య పరస్పర కాల్పులు జరిగినట్లు వార్తలు వెలువడినా, ఈ రోజు ఫిబ్రవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా షార్ట్‌ కవరింగ్‌....పాజిటివ్‌ ప్రారంభానికి కారణమని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ మినహా మిగతా దేశాల సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 28th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు భారతీ ఎయిర్‌టెల్‌:- ఫిబ్రవరి 28న జరిగే కంపెనీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైట్స్‌ ఇష్యూతో పాటు ఇతర మార్గాల్లో అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లు, బాం‍డ్ల/డిబెంచర్లు, ఇతర సెక్యూరిటీలను జారీ చేసి మూలధన నిధుల సమీకరించేందుకు బోర్డు నుంచి ఆమోదం కోరనుంది. పీఎన్‌బీ, అలహాబాద్‌ బ్యాంక్‌:- రెండు బ్యాంకులు రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించాయి.

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు అప్‌

Thursday 28th February 2019

 ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ వరుసగా రెండురోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు గురువారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 10,832పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,810 పాయింట్ల వద్ద ముగిసింది. గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా

Most from this category