STOCKS

News


స్వల్పలాభాలతో ప్రారంభం

Wednesday 31st October 2018
Markets_main1540957905.png-21595

ప్రపంచ మార్కెట్లు పటిష్టంగా వున్నా, భారత్‌ మార్కెట్‌ బుధవారం నిస్తేజంగా ప్రారంభమయ్యింది. రూపాయి విలువ బాగా తగ్గడం, కనిష్టస్థాయి నుంచి ముడి చమురు ధరలు కోలుకోవడం ఇందుకు కారణం బీఎస్‌ఈ సెన్సెక్స్‌71 పాయింట్ల పెరుగుదలతో 33,963 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 10,209 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు డాలరు మారకంలో 20 పైసల మేర క్షీణించిన రూపాయి విలువ తాజాగా మరో 20 పైసలు నష్టపోయి 73.88 వద్దకు తగ్గింది. అలాగే ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర గత రాత్రి 75 డాలర్ల దిగువకు „ీ ణించిన తర్వాత వేగంగా కోలుకుని 76.5 డాలర్ల స్థాయి ఎగువకు చేరింది. అయితే మన మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే సెన్సెక్స్‌ లాభం 110 పాయింట్ల మేరకు చేరగా, నిఫ్టీ లాభం 35 పాయింట్ల వరకూ పెరిగింది. ఎస్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌లు 1 శాతం పైగా పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. డాక్టర్‌ రెడ్డీస్‌లాబ్‌ 6 శాతంపైగా క్షీణతతో ప్రారంభంకాగా,  కోల్‌ ఇండియా 4 శాతం, టాటా స్టీల్‌ 2 శాతం చొప్పున తగ్గాయి. 

ప్రపంచ మార్కెట్లు అప్‌...
గత రాత్రి అమెరికా సూచీలు పటిష్టంగా 1.5 శాతం మేర ర్యాలీ జరపిన ప్రభావంతో బుధవారం ఆసియాలో దక్షిణ కొరియా కోస్పి మినహా, మిగిలిన ప్రధాన సూచీలన్నీ పెరిగాయి. అన్నింటికంటే అధికంగా తైవాన్‌ వెయిటెడ్‌ ఇండెక్స్‌ 2 శాతంపైగా ఎగిసింది. జపాన్‌ నికాయ్‌ 1.5 శాతం పెరిగింది. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్, సింగపూర్‌ స్ట్రయిట్‌టైమ్స్, చైనా షాంఘై సూచీలు 0.5–1 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజు రాత్రి అమెరికాలో డోజోన్స్‌ సూచీ 430 పాయింట్ల మేర ర్యాలీ జరిపి 24,800 పాయింట్ల ఎగువన ముగియగా, ఎస్‌ అండ్‌ పీ500 సూచి 40 పాయింట్ల వరకూ పెరిగి 2,683 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌–100 ఇండెక్స్‌ 111 పాయింట్లు ఎగిసింది. 

 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 31st October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం పలు కంపెనీల షేర్లు ఇవే..! కోల్‌ ఇండియా:- నేటి నుంచి కంపెనీలో 3శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.266కు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండురోజుల పాటు జరిగే ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి రూ.5,000 కోట్లు సమకూరుతాయని అంచనా. డాక్టర్‌ రెడ్డీస్‌:- యూఎస్‌ఎఫ్‌డీ దువ్వాడ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసింది. తనిఖీల అనంతరం 8

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు డౌన్‌

Wednesday 31st October 2018

గత రాత్రి అమెరికా సూచీలు 1.5 శాతం వరకూ ర్యాలీ జరిపినప్పటికీ, బుధవారం ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నా, సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మాత్రం ఉదయం 8.45 గంటలకు 26 పాయింట్ల తగ్గుదలతో 10,202 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారంనాడిక్కడ స్పాట్‌ నిఫ్టీ 10,198 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10,228 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ తగ్గుదల కారణంగా ఈ

Most from this category