STOCKS

News


లాభాల ప్రారంభం

Monday 15th April 2019
Markets_main1555300684.png-25122

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా లాభంతో 38,807 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 11,667 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కోలు 1-4 శాతం మధ్య లాభాలతో ప్రారంభంకాగా, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, భారతి ఎయిర్‌టెల్‌లు 1-3 శాతం మధ్య నష్టాలతో మొదలయ్యాయి.  శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు 1 శాతం వరకూ ర్యాలీ జరపగా, తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలు 1.5 శాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 15th April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వోకార్డ్‌:- ఇటీవల ఔరంగబాద్‌లోని యూనిట్‌ను తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ యూనిట్‌కు నో అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు ఎక్చే‍్సంజీలకు సమాచారం ఇచ్చింది.  జెట్‌ ఎయిర్వేస్‌:- ప్రమోటర్లు తనఖా పెట్టిన 5.19శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను ఏప్రిల్‌ 11న ఎస్‌బీఐక్యాప్స్‌ సొంతం చేసుకుంది.  డాక్టర్‌ రెడ్డీస్‌:-  అమెరికాలో 42 అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నట్లు తెలిపింది. అయితే ఏఎన్‌డీఏల

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 16 పాయింట్లు డౌన్‌

Monday 15th April 2019

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నా, సోమవారం భారత్‌ సూచీలు స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 9.50 నిముషాలకు 16 పాయింట్ల క్షీణతతో 11,687 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,703 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా వుండగా, శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు 1 శాతం వరకూ

Most from this category