STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Friday 12th April 2019
Markets_main1555041393.png-25079

శుక్రవారం సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ఫలితాల వెల్లడితో పాటు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 38,692 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,612 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బీపీసీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఆసియన్‌ పెయింట్స్‌, గెయిల్‌, టాటాస్టీల్‌లు 1-2 శాతం మధ్య లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సిప్లా:- దేశంలో మొదటి ఐసీఎస్‌-ఎల్ఎబీఏ కాంబినేషన్‌ ఔషధాన్ని విడుదల చేసింది. ఈ జనరిక్‌ ఔషధాన్ని శ్వాసకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు.  లుమాక్స్‌ అటో:- జర్మన్‌కి చెందిన జేఫ్‌ హోల్డింగ్‌ కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్‌ వెంచర్‌ ఇరు దేశాల్లో అటోమోటివ్‌ ఉపకరణాలను విక్రయించనుంది.  ఐడీబీఐ బ్యాంక్‌:- వివిధ వడ్డీరేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 5 నుంచి 10

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు డౌన్‌

Friday 12th April 2019

ఆసియా మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50  గంటలకు 30 పాయింట్ల నష్టంతో11,639 పాయింట్ల వద్ద కదులుతోంది. గత శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,669 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే గురువారం రాత్రి అమెరికా సూచీలు ఫ్లాట్‌గా ముగియగా, తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌ అరశాతం లాభంతో ట్రేడవుతుండగా,  మిగిలిన ప్రధాన

Most from this category