STOCKS

News


ఆర్‌బీఐ పాలసీతో మార్కెట్లకు దిశానిర్దేశం

Monday 3rd December 2018
Markets_main1543814104.png-22586

  • స్థూల గణాంకాలు, రూపాయి కదలికలూ కీలకం

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి కదలికలు తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అలాగే, తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ గణాంకాలు కూడా కీలకంగా ఉండగలవని పేర్కొన్నారు. ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు .. ట్రేడింగ్ ట్రెండ్‌ను ప్రభావితం చేయొచ్చని విశ్లేషించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండేళ్ల గరిష్టానికి ఎగిసిన జీడీపీ వృద్ధి .. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.1 శాతానికి నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్‌ 3 నుంచి 5 దాకా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అయిదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నెమ్మదించినప్పటికీ.. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథ స్థితిలో కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల గణాంకాలు.. ఆయా స్టాక్స్‌పై ప్రభావం చూపొచ్చని వివరించారు. ఇక "అంతర్జాతీయంగా జీ20 సదస్సులో అమెరికా-చైనా భేటీ ఫలితాలపైనా, చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్‌) క్రూడాయిల్‌ ఉత్పత్తి కోతలపై తీసుకోబోయే నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారు" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్‌ వినోద్ నాయర్ తెలిపారు. వివిధ రాష్ట్రాల ఎన్నికలతో ఈ నెల ప్రారంభం నుంచి కొంత అనిశ్చితి నెలకొనవచ్చని మరో మార్కెట్ నిపుణుడు తెలిపారు.You may be interested

ఫండ్‌కు రెండు స్కీమ్స్‌... దేంట్లో ఇన్వెస్ట్‌ చేయాలి

Monday 3rd December 2018

ప్ర: నేను వ్యాపారం చేస్తున్నాను. ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌)లో నేను రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే ఎన్‌పీఎస్‌ లో ఇన్వెస్ట్‌ చేస్తే గరిష్టంగా వచ్చే పన్ను ప్రయోజనం రూ.50,000 మాత్రమేనని మిత్రులు చెబుతున్నారు. అందుకని ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు రూ.50,000 వరకే పరిమితం చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర పన్ను ఆదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే నాకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మె 10కి వాయిదా

Monday 3rd December 2018

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఈ నెల 3 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను 10వ తేదీకి వాయిదా వేసుకున్నారు. టెలికం శాఖ సెక్రటరీ అరుణ సుందర్‌రాజన్‌తో ఆదివారం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి. 4జీ స్పెక్ట్రం కేటాయింపు, పెన్షన్‌ పునఃపరిశీలన, , బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల తరఫున పెన్షన్‌ చందా విషయంలో ప్రగతి ఉన్నట్టు అన్ని ఉద్యోగ సంఘాలతో కూడిన ఏయూఏబీ తెలిపింది. వేతన

Most from this category