News


మార్కెట్‌కు జిఎస్‌టి రుచించదు

Saturday 1st July 2017
Markets_main1498900597.png-4664

  • సమీప భవిష్యత్‌లో కరెక‌్షన్‌ కొనసాగుతుంది
  • సామ్కో సెక్యూరిటీస్‌ సిఇఒ జీమెత్‌మోదీ

ఒకే దేశం, ఒకే మార్కెట్‌, ఒకే పన్ను నినాద ఉద్దేశాన్ని నెరవేర్చేక్రమంలో జిఎస్‌టిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి జిఎస్‌టితో ఏంజరగబోతుందన్నదానిపై, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న అంశాలపై విస్తృత ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాస్తవాలు బయటకు రావాలంటే మరికొంత సమయం పడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జిఎస్‌టితో ప్రభుత్వాదాయం పెరగుతుందని, పన్నుఎగవేతలు తగ్గుతాయని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే స్వల్పకాలానికి జిఎస్‌టి కారణంగా వ్యాపారాల్లో అలజడి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ అలజడి కారణంగా వినిమయం తగ్గి, వృద్ధి మందగించే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. ప్రతిపాదనల్లో బాగానే ఉన్నా, ఆచరణలో సక్సెస్‌ అయితేనే జిఎస్‌టికి సార్ధకత లభిస్తుందని సామ్కో సెక్యూరిటీస్‌ సిఇఒ జీమెత్‌మోదీ అభిప్రాయపడుతున్నారు. భారీ జనాభా, ఎక్కువశాతం అసంఘటితర రంగ వ్యాపారాలున్న దేశంలో ఇలాంటి సంస్కరణ అమలే అతిపెద్ద సవాల్‌ అని అన్నారు. దేశ పరిస్థితులను బట్టి చూస్తే జిఎస్‌టి కారణంగా స్వల్ప, మధ్యకాలానికి ఎగుడుదిగుడులు తప్పవని, దీర్ఘకాలంలో మంచి జరుగుతుందని అన్నారు. దేశీయ స్టాక్‌మార్కెట్‌ విషయానికి వస్తే.. అనిశ్చితిని సూచీలు ఇష్టపడవని ఆయన అన్నారు. జిఎస్‌టి అమలు, నిర్వహణపై ఎంతో అనిశ్చితి ఉన్నందున స్వల్పకాలానికి మార్కెట్లు కరెక‌్షన్‌బాట పట్టవచ్చన్నారు. ఈ కాలంలో ఆయా కంపెనీల షేర్లు వైయుక్తిక వార్తల ఆధారంగా కదులుతాయన్నారు. ప్రస్తుత సంధికాలంలో కొత్త పెట్టుబడులకు అవకాశాలు స్వల్పమని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మదుపరులు ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించారు.
-
నిఫ్టీ చార్టుల్లో బలమైన బేరిష్‌కాండిల్‌ కనిపిస్తోంది. అయితే డైలీ చార్టుల్లో చిన్న రికవరీని సూచించే సంకేతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్థాయిల నుంచి కొంత మేర కోలుకొని తదనంతరం తిరిగి కరెక‌్షన్‌ మూడ్‌లోకి నిఫ్టీ పయనిస్తుందని చెప్పవచు‍్చ. (ఇది జీమెత్‌ అంచనా మాత్రమే. పెట్టుబడులు పెట్టేముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాలి.)



You may be interested

సప్లయ్‌ అంటే... సరఫరా మాత్రమే కాదు!

Saturday 1st July 2017

జీఎస్‌టీతో పాటు కొత్త పదాలూ వస్తున్నాయ్‌  యాంటీ ప్రాఫిటీరింగ్‌ నుంచి జీరో రేటెడ్‌ సప్లయ్‌ దాకా... జీఎస్‌టీ అమల్లోకి వచ్చేసినట్టే! ఈ జీఎస్‌టీతో పాటు ఇకపై మనకు తరచూ వినిపించే పదాలూ కొన్ని ఉన్నాయి. అవి తెలియకుంటే... జీఎస్‌టీ కూడా అర్థం కాదు కనక, వాటిని తెలుసుకోవాలి. అలవాటు చేసుకోవాలి. ఆ కొత్త పదాలేంటో ఒకసారి చూద్దాం... యాంటీ ప్రాఫిటీరింగ్‌: జీఎస్‌టీలో పన్ను రేటు తగ్గటం వల్లో, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పెరగటం వల్లో

ఉద్యోగినుల్లో 10 శాతం మందికే ఆరోగ్య బీమా

Saturday 1st July 2017

– అవగాహన లేమి, కుటుంబం మీద ఆధారపడటం వంటివి కారణం – ఫ్యామిలీ హెల్త్‌ పాలసీల కంటే వ్యక్తిగత పాలసీ ఎంపికే ముఖ్యం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న మహిళలు.. ఆరోగ్య బీమా పథకాల ఎంపిక విషయానికొచ్చే సరికి ఆమడదూరంలో ఉంటున్నారు. జనాభా నిష్పత్తిలోనే కాదు.. హెల్త్‌ పాలసీల ఎంపికలోనూ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఓ ఆరోగ్య బీమా కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో కేవలం పదంటే

Most from this category