STOCKS

News


మధ్యకాలానికి మార్కెట్లు భేష్‌: గౌతమ్‌షా

Wednesday 24th April 2019
Markets_main1556128629.png-25322

మన ఈక్విటీ మార్కెట్లు మధ్య కాలానికి (మీడియం టర్మ్‌) చాలా బలంగా కనిపిస్తున్నాయని జేఎం ఫైనాన్షియల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌, టెక్నికల్‌ అనలిస్ట్‌ గౌతమ్‌షా అంటున్నారు. స్వల్ప కాలంలో మాత్రం నిఫ్టీ విరామంలో ఉందన్నారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. నిఫ్టీ 10,600 పాయింట్ల నుంచి 11,800 పాయింట్లకు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే చేరుకుందన్నారు.  స్వల్ప వ్యవధిలోనే 1,200 పాయింట్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా వేగంగా ర్యాలీ జరిగిందని, మధ్యలో కరెక్షన్‌ లేదన్నారు. ఏదో ఒక సమయంలో సూచీలు అధిక కొనుగోళ్ల జోన్‌లోకి వెళ్లాయన్నారు. దీంతో విక్రయాలకు అవకాశంగా కొందరు భావించడమే మధ్యలో విరామానికి కారణంగా ఆయన వివరించారు.


 
గతేడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో 11,700-11,800 చేరినప్పుడు కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడమే వల్ల ఇంత కాలం కన్సాలిడేషన్‌కు కారణమని గౌతమ్‌షా అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం మన మార్కెట్లు స్థిరీకరణ జోన్‌లో ట్రేడ్‌ అవుతాయని అంచనా వేశారు. ‘‘మరికొంత ధరల ఆధారిత, సమయం ఆధారిత కరెక్షన్‌ను చూడొచ్చు. ప్రస్తుత పుల్‌బ్యాక్‌ ర్యాలీ వచ్చే నెల కీలకమైన ఈవెంట్‌కు ముందు ఆగిపోవచ్చు. మార్కెట్‌ తదుపరి దశ ర్యాలీకి ప్లాట్‌ఫామ్‌ను రెడీ చేసుకుంటోంది. ఇది నిఫ్టీని 12,222కు తీసుకెళుతుంది. కనుక పరిణామాలేమీ పెద్దగా మారిపోలేదు. ఇవి కేవలం స్వల్పకాలిక ఆటుపోట్లే. పరిస్థితులు క్రమంగా అధిక కొనుగోళ్లకు దారితీస్తాయి. మార్కెట్లు ఒకవేళ పడితే 11,400 మార్క్‌ వరకు కొనుగోళ్లకు అవకాశంగా చూడాలి. రిస్క్‌ కొద్దీ రాబడులు ఆశాజనకంగానే  ఉంటాయి’’ అని గౌతమ్‌షా తెలిపారు. బ్యాంక్‌ నిఫ్టీ 29,000 స్థాయిల్లో తాజా లాంగ్‌ పొజిషన్లు చోటు చేసుకోవచ్చన్నారు. బ్యాంకు నిఫ్టీకి 32,500 టార్గెట్‌ ఇచ్చారు. 



You may be interested

పడుతున్న స్టాక్స్‌ను కొన్నదెవరు..?

Wednesday 24th April 2019

మార్చి త్రైమాసికంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు, హెచ్‌ఎన్‌ఐలు బాగా పడిపోతున్న స్టాక్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపించినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఫండమెంటల్స్‌లో మార్పులు, రుణాల భారం తదితర అంశాలతో పడిపోయే వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. బాగా పడుతుండడంతో చౌక వ్యాల్యూషన్లు అని పొరబడ్డారా లేక భారీగా పడిన తర్వాత కొంత రికవరీ అయితే లాభాలు గడిద్దామనుకున్నారా... వారికే తెలియాలి. ఇలా వీరు ఆరాటం కొద్దీ కొన్న షేర్లలో జెట్

టాటామోటర్స్‌ షేరును ప్రస్తుతం కొనొచ్చా?

Wednesday 24th April 2019

బుధవారం ట్రేడింగ్‌లో టాటామోటర్స్‌ షేరు దాదాపు 4 శాతం పతనమైంది. దీంతో వరుసగా మూడో సెషన్లో కూడా షేరు డౌన్‌ట్రెండ్‌ కొనసాగించినట్లయింది. నిజానికి గత కొన్నాళ్లుగా ఈ షేరు అనూహ్య అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ఈ ఏడాది ఇంతవరకు షేరు దాదాపు 34 శాతం ర్యాలీ జరిపింది. గతేడాది మే అనంతరం షేరు దీర్ఘకాలిక పతనావస్థలోకి జారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాది కనిష్ఠస్థాయి రూ.142ను తాకింది. అయితే అక్కడనుంచి ఒక్కమారుగా

Most from this category