STOCKS

News


మార్కెట్‌ వేడెక్కి ఉంది.. జాగ్రత్త!

Saturday 16th March 2019
Markets_main1552735363.png-24649

కన్సాలిడేషన్‌ వరకు వేచి ఉండడం మంచిది
నిపుణుల సూచన
నెలారంభం నుంచి విరామం లేకుండా దేశీ సూచీలు ర్యాలీ జరుపుతున్నాయి. దీంతో అన్ని చార్టుల్లో ఇండికేటర్లు ఓవర్‌బాట్‌ స్థితిని చూపుతున్నాయని, మార్కెట్లో కాస్త వెసులుబాటు కనిపించేవరకు అతి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌ పరుగు చూసి ఆశతో ముందుకు పోకుండా, ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ వారంలో మార్కెట్‌ చిన్నపాటి వెనుకంజ వేయడం తప్పనిసరని అంచనా వేస్తున్నారు. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ కీలక నిరోధ స్థానాల వద్ద కదలాడుతోంది. ఇందుకు తగ్గట్లే శుక్రవారం నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల మేర వెనక్కుతగ్గింది.

ఒకవేళ సోమవారం స్థిరమైన ఆరంభం కనిపించినా, వారాంతానికి నిఫ్టీలో చిన్నపాటి కన్సాలిడేషన్‌ తప్పకపోవచ్చు. పైన నిఫ్టీకి 11500, 11625 పాయింట్ల వద్ద నిరోధం ఉంది. దిగువన 11210, 10950 పాయింట్ల వద్ద మద్దతు ఉంది. ఆర్‌ఎస్‌ఐ 60కి పైన కొనసాగుతూ బుల్లిష్‌గా ఉంది. ఎంఏసీడీ సైతం పాజిటివ్‌గానే ఉంది. అందువల్ల మిడ్‌టర్మ్‌లో మార్కెట్‌ ర్యాలీ కొనసాగవచ్చు. కానీ అతి సమీపంలో మాత్రం కొంతమేర సూచీలు సర్దుబాటుకు గురయ్యే అవకాశాలే అధికం. నిఫ్టీ ప్రస్తుతం బోలింగర్‌ బ్యాండ్‌ పై అవధికి పైన క్లోజయింది. ఇది ఒక తాజా బ్రేకవుట్‌కు సంకేతం. ఇలాంటి స్థితిలో ఒకమారు తిరిగి బ్యాండ్‌ మధ్యఅవధి వరకు పుల్‌బ్యాక్‌ ఉంటుంది. అదీకాక కన్సాలిడేషన్‌ లేని పరుగు అత్యంత ప్రమాదకరం. ఇవన్నీ పరిశీలిస్తే ఓవర్‌హీటయిన మార్కెట్‌ కాస్త చల్లబడేవరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన. కొత్త పొజిషన్ల జోలికి కొన్ని రోజులు పోకుండా, ఉన్న పొజిషన్లకు కచ్ఛితమైన స్టాప్‌లాస్‌లు పాటిస్తూ ఉండాలి. ఈ సమయంలో ఆశ కన్నా ఆలోచన చాలా అవసరం. 



You may be interested

నెక్ట్స్‌ ర్యాలీ ఈ రంగ కంపెనీల నుంచే!

Sunday 17th March 2019

బ్యాంకుల రుణ వృద్ధి 14.4 శాతానికి మెరుగుపడడం, ఆర్‌బీఐ వృద్ధికి అనుకూల ధోరణి, బ్యాంకింగ్‌ రీక్యాపిటలైజేషన్‌, లిక్విడిటీ మెరుగుదల, రిస్క్‌ ఆధారిత వ్యాల్యూషన్లు తదితర అంశాలన్నీ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ గత గరిష్టాలను దాటేందుకు ట్రిగ్గర్‌గా పనిచేశాయని, ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ పేర్కొన్నారు. తదుపరి మార్కెట్‌ ర్యాలీల్లో ఈ రంగం ముందుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను

1300డాలర్లపైన ముగింపు

Saturday 16th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 1300 డాలర్ల పైన ముగిసింది. చైనా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోతుందని ఆర్థికవేత్తలు అంచనాలతో పాటు, అమెరికా ఉద్యోగ గణాంకాలు, తయారీ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం పసిడి ర్యాలీకి కలిసొచ్చాయి. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి ధర 7.15డాలర్లు పెరిగి 1,302.25డాలర్ల వద్ద ముగిసింది. న్యూజిలాండ్‌ మసీదులో అగంతకుడి కాల్పులతో 40 మంది

Most from this category