గ్యాప్‌అప్ ఓపెనింగ్
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 37,121 పాయింట్లతో పోలిస్తే 157 పాయింట్ల లాభంతో 37,278 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,234 పాయింట్లతో పోలిస్తే 37 పాయింట్ల లాభంతో 11,271 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 37,405 పాయింట్ల వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 11,316 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ సహా ఎస్అండ్పీ 500 కొత్త గరిష్ట స్థాయిలో క్లోజవ్వడం, ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, డిన్యూక్లియరైజేషన్ వేగవంతం కోసం ఉత్తర కొరియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మరోమారు చర్చలను ఆహ్వానిస్తోందని దక్షిణ కొరియా పేర్కొనడం, క్రూడ్ ధరలు శుక్రవారం దాదాపు స్థిరంగా ఉండటం, ఇండియన్ ఆర్థిక వ్యవస్థ 2022 నాటి కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని ప్రధాని మోదీ పేర్కొనడం, రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 61 పైసలు బలపడి 72.37 వద్ద ముగియడం, అక్టోబర్ 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్ ప్రారంభం కోసం బీఎస్ఈ సహా ఎన్ఎస్ఈలకు సెబీ అనుమతినివ్వడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఇక నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐఓసీ, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, గెయిల్ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, జీ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉన్నాయి.
You may be interested
రూపీ మరింత రివకరీ
Friday 21st September 2018అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి శుక్రవారం బలపడింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగకపోవచ్చనే అంచనాలు, వర్ధమాన కరెన్సీలు లాభాల్లో ఉండటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.93 వద్ద ట్రేడ్ అవుతోంది. తన బుధవారం ముగింపు 72.38తో పోలిస్తే 0.70 శాతంమేర లాభపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 71.86 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల
యస్ బ్యాంక్ 30 శాతం క్రాష్
Friday 21st September 2018యస్ బ్యాంక్ శుక్రవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో నిలువునా పతనమైంది. ఆ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ పదవిలో కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతి నిరాకరించడంతో ఈ షేరు ట్రేడింగ్ ప్రారంభంలోనే 20శాతం పతనమైన రూ.250 వద్ద పతనమైంది. కొద్ది నిమిషాల్లోనే ఇది 30శాతం వరకు పడిపోయి రూ.218 కనిష్టస్థాయిని తాకింది. ఉదయం 9:20ని.లకు 22శాతం క్షీణతతో రూ.247ల వద్ద ట్రేడ్ అవుతోంది.