STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రాష్‌..

Thursday 11th October 2018
Markets_main1539228434.png-21023

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:35 సమయంలో ఏకంగా 271 పాయింట్ల నష్టంతో 10,208 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,465 పాయింట్లతో పోలిస్తే 257 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

ఆసియా మార్కెట్లు ఢమాల్‌..
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 1020 పాయింట్ల (4.34 శాతం) భారీ నష్టంతో 22,499 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 978 పాయింట్ల (3.73 శాతం) భారీ నష్టంతో 25,214 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 82 పాయింట్ల నష్టంతో 3,049 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ ఏకంగా 614 పాయిం‍ట్ల (5.87 శాతం) నష్టంతో 9,851 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 121 పాయింట్ల (4.47 శాతం) నష్టంతో 2,604 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 81 పాయింట్ల (3.64 శాతం) నష్టంతో 2,147 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్‌ పతనం
అమెరికా మార్కెట్లు బుధవారం మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికిపైగా పతనమైంది. ఫిబ్రవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. బాండ్‌ ఈల్డ్స్‌ పెరడగం, టెక్నాలజీ స్టాక్స్‌ కుదేలవ్వడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 832 పాయిం‍ట్ల (2.2 శాతం) నష్టంతో 25,598 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 95 పాయింట్ల (3.29 శాతం) నష్టంతో 2,785 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 316 పాయింట్ల (4.08 శాతం) నష్టంతో 7,422 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లలోని అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు నెగటివ్‌ ప్రభావం చూపాయి.
 



You may be interested

భారీ గ్యాప్‌డౌన్‌..

Thursday 11th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం భారీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,760 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 697 పాయింట్ల నష్టంతో 34,063 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,460 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 291 పాయింట్ల నష్టంతో 10,169 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 2.8 శాతంమేర పతనమయ్యాయి. పతనానికి కారణాలివే.. ► అమెరికా మార్కెట్లు బుధవారం మూడు నెలల కనిష్ట స్థాయికి

ఎట్టకేలకు రిలీఫ్‌ర్యాలీ

Wednesday 10th October 2018

10460 స్థాయిని అందుకున్ననిఫ్టీ సెన్సెక్స్‌ 461 పాయింట్ల లాభం మార్కెట్‌ను నడిపించిన బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు ముంబై:- ఎట్టకేలకు మార్కెట్‌లో రిలీఫ్‌ర్యాలీ జరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బేర్స్‌ షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ఆరునెలల కనిష్టస్థాయి నుంచి కోలుకున్నాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై మార్కెట్‌ ఆశావహన అంచనాలు కూడా మార్కెట్‌ ర్యాలీకి కారణమైంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 482

Most from this category