STOCKS

News


సెన్సెక్స్‌ @ 35,400

Thursday 15th November 2018
Markets_main1542269953.png-22049

  • 250 పాయింట్లు అప్
  • 10,640 వద్ద నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఫ్లాట్‌గా ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత పెరిగాయి. అటుపైన పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1:40 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 253 పాయింట్ల లాభంతో 35,395 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,640 వద్ద ఉన్నాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ 35,400 పాయింట్ల గరిష్ట స్థాయిని, 35,118 పాయింట్ల కనిష్ట స్థాయికి తాకింది. ఇక నిఫ్టీ 10,557- 10,646 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. 

ఇక నిఫ్టీ-50లో అదానీ పోర్ట్స్‌ 4 శాతం ఎగసింది. టాటా మోటార్స్‌, టైటాన్, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. టెక్‌ మహీంద్రా, హీరో మోటొకార్ప్‌, ఐషర్‌ మోటార్స్‌ 2 శాతానికిపైగా లాభపడ్డాయి. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 8 శాతానికిపైగా పతనమైంది. యస్‌ బ్యాంక్‌ 7 శాతానికిపైగా పడిపోయింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 6 శాతానికిపైగా నష్టపోయింది. 

ఒక్క నిఫ్టీ మీడియా మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా ఎగశాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లన్నీ 1 శాతం సమీపానికి పెరిగాయి. 



You may be interested

బ్రోకరేజ్‌లు మెచ్చిన 5 షేర్లు

Thursday 15th November 2018

విదేశీ ఇన్వెస్టర్లు గత త్రైమాసికంలో అధిక శాతంలో షేర్లను విక్రయించినప్పటికీ.. పలు షేర్లలో మాత్రం హోల్డింగ్స్‌ పెంచారు. పెరిగిన వీరి వాటాల ఆధారంగా 47 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను బ్రోకరేజ్‌ సంస్థలు సూచిస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్‌)కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. అంతకుముందు వరుసగా రెండు నెలల్లోనూ పాజిటీవ్‌గా కొనసాగిన వీరి నిధుల ప్రవాహం.. అమెరికా-చైనా మధ్య కొనసాగిన వాణిజ్య యుద్ధం, ముడిచమురు

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం ర్యాలీ

Thursday 15th November 2018

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ గురువారం మిడ్‌ సెషన్‌ సమయానికి 1శాతం లాభపడింది.  ఈ సూచీలోని యాక్సిస్‌ బ్యాంక్‌ (3 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(2 శాతం) షేర్లు ర్యాలీ సూచీని లాభాల బాట పట్టించింది. మధ్యాహ్నం గం.1:10ని.లకు సూచి గతముగింపు(25,930.15)తో పోలిస్తే దాదాపు శాతం (0.90శాతం) లాభపడి 26,170.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన  మొత్తం 11 షేర్లలో 9

Most from this category