STOCKS

News


ఆరంభం అదిరింది..

Thursday 29th November 2018
Markets_main1543464321.png-22463

  • 10,800 పాయింట్లకు పైన నిఫ్టీ
  • 36,000 సమీపంలో సెన్సెక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,728 పాయింట్లతో పోలిస్తే 80 పాయింట్ల లాభంతో 10,808 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,716 పాయింట్లతో పోలిస్తే 281 పాయింట్ల లాభంతో 35,997 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.

భారత్‌ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.6 శాతానికి తగ్గొచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ అంచనా వేయడం, ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 28న అమెరికా డాలర్‌తో పోలిస్తే 17 పైసలు బలపడి 70.62 వద్ద ముగియడం, స్టార్టప్స్‌ లిస్టింగ్‌ కోసం బీఎస్‌ఈ తన ఎస్‌ఎంఈ విభాగంలో కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం, దాదాపు 19 నెలల తర్వాత నవంబర్‌లో డీఐఐలు నికర విక్రయదారులుగా మిగలడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం అంచనా వేసిన దానికన్నా ఎక్కువగానే ఉండొచ్చని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే అభిప్రాయపడటం, క్రూడ్‌ ధరలు గురువారం 1 శాతం మేర పెరిగడం, ఒక్క హాంగ్‌ సెంగ్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాల్లోనే ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు బుధవారం భారీగా లాభపడటం, ప్రస్తుతం వడ్డీ రేట్లు దాదాపుగా తటస్థ స్థాయికి దగ్గరిలో ఉన్నాయని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ పేర్కొనడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ-50లో వేదాంత, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. యస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యస్‌ బ్యాంక్‌ దాదాపు 6 శాతం మేర పతనమైంది. ఓఎన్‌జీసీ 2 శాతం మేర నష్టపోయింది. ఇక వేదాంత 3 శాతానికి పైగా పెరిగింది. హిందాల్కో 2 శాతానికి పైగా లాభపడింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ దాదాపుగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే నిఫ్టీ ఐటీ మాత్రం నష్టాల్లోనే ఉంది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి. 



You may be interested

3 నెలల గరిష్టానికి రూపీ

Thursday 29th November 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం మరింత బలపడింది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.75 శాతం పెరుగుదలతో 70.09 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 70.62గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.17 వద్ద ప్రారంభమైంది.  ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యల వల్ల

మార్కెట్‌ పెరుగుతుందా?

Thursday 29th November 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 96 పాయింట్ల లాభంతో 10,811 పాయింట్ల వద్ద ఉంది.  ♦ భారత్‌ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.6 శాతానికి తగ్గొచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇండస్ట్రీయల్‌ యాక్టివిటీ నెమ్మదించడం ఇందుకు కారణమని తెలిపింది. జూన్‌ క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2 శాతంగా

Most from this category