STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 16th November 2018
Markets_main1542340384.png-22061

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,616 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల లాభంతో 10,644 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,260 పాయింట్లతో పోలిస్తే 138 పాయింట్ల లాభంతో 35,398 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఒక్క సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, ఒపెక్‌ దేశాల నుంచి ఆయిల్‌ ఉత్పత్తి తగ్గొచ్చనే అంచనాలున్నా.. అమెరికాలో ఆయిల్‌ ఉత్పత్తి పెరగడం వల్ల క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగా ఉండటం, రూపాయి రెండు నెలల గరిష్ట స్థాయికి ర్యాలీ చేసి అమెరికా డాలర్‌తో పోలిస్తే గురువారం 34 పైసల లాభంతో 71.97 వద్ద ముగియడం, వాణిజ్య లోటు అక్టోబర్‌లో 17.13 బిలియన్‌ డాలర్లకు పెరగడం, ఫిచ్‌.. భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను స్థిరంగా ‘బీబీబీ-’ కొనసాగిస్తున్నట్లు పేర్కొనడం, బంగారం దిగుమతులు అక్టోబర్‌లో 43 శాతం క్షీణతతో 1.68 బిలియన్‌ డాలర్లకు తగ్గడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు.  

ఇక నిఫ్టీ-50లో హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఐషర్‌ మోటార్స్‌, టీసీఎస్‌, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌, ఐఓసీ, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యస్‌ బ్యాంక్‌ 2 శాతానికి పైగా పడిపోయింది. ఐఓసీ 2 శాతం మేర క్షీణించింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ 2 శాతం మేర లాభపడింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 1 శాతానికి పైగా పెరిగింది.   

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 



You may be interested

స్వల్పకాలానికి 3 సిఫార్సులు

Friday 16th November 2018

టెక్నికల్స్‌ ఆధారంగా మూడు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌ సూచించింది. స్టాప్‌లాస్‌ను నిర్వహిస్తూ వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్వల్పకాలంలో 6-9 శాతం వరకు రాబడిని పొందవచ్చని సిఫార్సుచేసింది. మారుతి సుజుకి | ప్రస్తుత ధర: రూ.7,524 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.7,950 | స్టాప్ లాస్‌: రూ. 7,250 | రాబడి అంచనా 6.5 శాతం నెస్లే | ప్రస్తుత ధర: రూ.10,487 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.

మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Friday 16th November 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.83 శాతం లేదా 209 పాయిం‍ట్ల లాభంతో 25,289 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.06 శాతం లేదా 29 పాయింట్ల లాభంతో 2,730 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.72 శాతం లేదా 123 పాయింట్ల లాభంతో 7,259 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా-అమెరికా మధ్య

Most from this category