News


లాభాల స్టార్ట్‌

Thursday 27th September 2018
Markets_main1538020483.png-20611

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,542 పాయింట్లతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 36,691 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,053 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 11,079 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
 
అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఎంత కాలం రేట్లను పెంచుకుంటూ వెళ్తోందనన్న భయాలతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకోడానికి మొగ్గుచూపడంతో అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, ఫెడ్‌ రేటు పెంపు వల్ల అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం, అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచడంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే మూడేళ్లపాటు మంచి వృద్ధిని నమోదు చేస్తుందని ఫెడ్‌ అంచనా వేయడం, ఆయిల్‌ మార్కెట్‌లో సరఫరా తగ్గడం వల్ల క్రూడ్‌ ధరలు గురువారం ఒక శాతంమేర పెరిగి బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 82.17 డాలర్లకు చేరడం, ద్రవ్యోల్బణం అంచనాలకు అనువుగా ఉన్నప్పటికీ రూపాయికి బలాన్ని చేకూర్చేందుకు ఆర్‌బీఐ రానున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంచుతుందని రాయిటర్స్‌ పేర్కొనడం, చైనా నవంబర్‌ 1 నుంచి మెషినరీ, పేపర్‌, టెక్స్‌టైల్స్‌, కన్‌స్ట్రక‌్షన్‌ మెటీరియల్స్‌ సహా పలు దిగుమతులపై టారిఫ్‌లను తగ్గించనుండటం, కేంద్ర ప్రభుత్వం దాదాపు 19 ప్రొడక్టులపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచడం వల్ల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలు పెరగనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో గెయిల్‌, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.  



You may be interested

రూపీ అప్‌

Thursday 27th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం బలపడింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు దిగుమతి ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన బుధవారం ముగింపు 72.62తో పోలిస్తే 0.30 శాతంమేర లాభపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 72.41 వద్ద ప్రారంభమైంది.  కేంద్ర ప్రభుత్వం బుధవారం

మార్కెట్‌పై వీటి ప్రభావం

Thursday 27th September 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 106 పాయింట్ల (0.4 శాతం) క్షీణతతో 26,385 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్ల (0.33 శాతం) నష్టంతో 2,905 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 17 పాయింట్ల (0.21 శాతం) నష్టంతో 7,990 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఎంత కాలం

Most from this category