STOCKS

News


10,950 దిగువున నిఫ్టీ

Friday 21st December 2018
Markets_main1545364628.png-23119

  • సెన్సెక్స్‌ 38 పాయింట్లు డౌన్‌

అంతర్జాతీయ మార్కెట్ల బలహీత కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ నష్టపోతే.. సెన్సెక్స్‌ పెరిగింది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,951 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో 10,944 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,431 పాయింట్లతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 36,449 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే సెన్సెక్స్‌ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 9:22 సమయంలో నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 10,939 వద్ద, సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 36,394 వద్ద ట్రేడవుతున్నాయి.   

ఇండియన్‌ రూపాయి గురువారం 69 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.70 వద్ద ముగియడం, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.41,000 కోట్ల మూలధనాన్ని అందించేందుకు పార్లమెంట్‌ అనుమతి కోరడం, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు విలువ నవంబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ తన ఎడ్యుకేషన్‌ బిజినెస్‌ సహా అల్టార్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌లలో వాటా విక్రయించేందకు రెడీ అవుతుండటం,  ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో)లో విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) పరిమాణం 6.5 శాతానికి మించకూడదని ఆర్‌బీఐ నియంత్రణలు విధించడం, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి డిసెంబర్‌ 7తో ముగిసిన పక్ష కాలంలో 15.07 శాతం.. డిపాజిట్లు 9.66 శాతం పెరగడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు గురువారం మళ్లీ పతనం కావడం వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణుల పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఐఓసీ, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐవోసీ దాదాపు 4 శాతం మేర పతనమైంది. ఇన్ఫోసిస్‌ 1 శాతానికి పైగా నష్టపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌ షేర్లు 1 శాతం మేర క్షీణించాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా లాభపడింది. 



You may be interested

తగ్గిన రూపాయి

Friday 21st December 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే నష్టపోయింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనల కారణంగా గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో రూపాయి 70.05 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (గురువారం) 69.70తో పోలిస్తే 0.49 శాతం నష్టపోయింది. 69.94 వద్ద ప్రారంభమైన రూపాయి.. 69.70 గరిష్ట స్థాయిని, 70.06 కనిష్ట స్థాయిని తాకింది.  అమెరికా ప్రభుత్వం

మార్కెట్‌ ఎటు?

Friday 21st December 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 40 పాయింట్ల నష్టంతో 10,953 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఇండియన్‌ రూపాయి గురువారం 69 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.70 వద్ద ముగిసింది.  ♦ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.41,000 కోట్ల మూలధనాన్ని అందించనుంది. దీని కోసం పార్లమెంట్‌ అనుమతి కోరింది.  ♦ ఈక్విటీ మ్యూచువల్‌

Most from this category