STOCKS

News


గ్యాప్‌అప్‌తో ఆరంభం..

Friday 12th October 2018
Markets_main1539316575.png-21060

గురువారం కుదేలైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,001 పాయింట్లతో పోలిస్తే 290 పాయింట్ల లాభంతో 34,291 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,234 పాయింట్లతో పోలిస్తే 97 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  

అమెరికా మార్కెట్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, కరెంటు ఖాతా లోటు కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచడం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్ట్‌లో నికరంగా చూస్తే 2.323 బిలియన్‌ డాలర్లను విక్రయించడం, రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు బలపడి 74.12 వద్ద ముగియడం, సరఫరా భయాలు తగ్గడం సహా గ్లోబల్‌గా ఈక్విటీ మార్కెట్లు పతనం కావడం వల్ల క్రూడ్‌ ధరలు శుక్రవారం స్థిరంగానే ఉండటం, ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్లను నెలవారీగా తెలియజేయాలని డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌ను మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కోరడం, దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ2లో రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం, హెచ్‌యూఎల్‌ శుక్రవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో బీపీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, ఐఓసీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, వేదాంత, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. టీసీఎస్‌ ప్రారంభంలోనే 2 శాతానికిపైగా పతనమైంది. యస్‌ బ్యాంక్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. 
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మాత్రమే నష్టాల్లో ఉంది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి. 



You may be interested

టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు భళా: షేరు డీలా..!

Friday 12th October 2018

దేశీ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి సంస్థ టీసీఎస్‌ షేరుకు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు రుచించలేదు. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఆ షేరు 2.75శాతం నష్టపోయింది. కంపెనీ గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాలను ప్రకటించింది. ఆ క్యూ2తో కం‍పెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 12th October 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగిసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఆజ్యం పోసుకోవడం, వడ్డీ రేట్ల పెంపు భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆగస్ట్‌ 29 నుంచి నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10.3 శాతంమేర క్షీణించింది.  ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఏకంగా ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 545 పాయిం‍ట్ల

Most from this category