STOCKS

News


నష్టాల్లో మార్కెట్లు

Tuesday 13th November 2018
Markets_main1542081310.png-21915

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,482 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,812 పాయింట్లతో పోలిస్తే 34 పాయింట్ల లాభంతో 34,846 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 9:18 సమయంలో సెన్సెక్స్‌ 58 పాయింట్ల నష్టంతో 34,754 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 10,450 వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోవడం, డాలర్‌ 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం, యూరప్‌లోని రాజకీయ అస్థిరతలు నెలకొనడం, ఆసియా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతానికి తగ్గడం, పారిశ్రామికోత్పత్తి సెప్టెంబర్‌లో 4.5 శాతంగా నమోదవ్వడం, సరఫరాను తగ్గించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒపెక్‌ దేశాలపై ఒత్తిడి తీసుకురావడంతో క్రూడ్‌ ధరల మంగళవారం 1 శాతానికి పైగా తగ్గడం (బ్రెంట్‌ క్రూడ్‌ 70 మార్క్‌ దిగువకు, డబ్ల్యూటీఐ 60 డాలర్ల దిగువకు వచ్చాయి), భారత్‌ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో 7.3 శాతానికి (ఇది వరకు 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది) తగ్గొచ్చని యూబీఎస్‌ అంచనా వేయడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం 39 పైసలు క్షీణించి 72.89 వద్ద ముగియడం, పీఈ/వీసీ ఇన్వెస్ట్‌మెంట్లు అక్టోబర్‌లో 50 శాతం వృద్ధితో 3.1 బిలియన్‌ డాలర్లకు చేరడం, ఆర్‌బీఐ కొన్ని బ్యాంకులకు సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చనే అంచనాలు, దాదాపు 591 కంపెనీలు మంగళవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో హిందుస్తాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్‌, ఐఓసీ, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, గెయిల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హిందుస్తాన్‌ పెట్రోలియం షేరు 3 శాతానికిపైగా పెరిగితే, టాటా మోటార్స్‌ షేరు 3 శాతంమేర పడిపోయింది.  

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. 



You may be interested

రూపాయి అప్‌..

Tuesday 13th November 2018

ఇండియన్‌ రూపాయి మంగళవారం స్వల్పంగా బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 10 పైసలు లాభంతో 72.79 వద్ద ప్రారంభమైంది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం ఇందుకు కారణం. రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతించడం కూడా సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 72.72 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు స్థాయి 72.89తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. కాగా రూపాయి

మార్కెట్‌ తగ్గుతుందా?

Tuesday 13th November 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ► అమెరికా మార్కెట్లు సోమవారం పతనం కావడం, డాలర్‌ 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం, యూరప్‌లోని రాజకీయ అస్థిరతలు, క్రూడ్‌ ధరలు తగ్గుదల వంటి అంశాల కారణంగా ఆసియా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 32 పాయింట్ల నష్టంతో 3,036 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 131 పాయిం‍ట్ల నష్టంతో 9,699 పాయింట్ల వద్ద,

Most from this category