నష్టాల ఆరంభం
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,869 పాయింట్లతో పోలిస్తే 49 పాయింట్ల నష్టంతో 10,820 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్ తన మునపటి ముగింపు 36,134 పాయింట్లతో పోలిస్తే 99 పాయింట్ల నష్టంతో 36,035 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:24 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 194 పాయింట్ల నష్టంతో 35,940 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో 10,808 వద్ద ట్రేడవుతున్నాయి. రిజర్వు బ్యాంక్ బుధవారం (నేడు) జరగనున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తుండటం, అమెరికా ఇన్వెంటరీలు పెరగడం సహా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో క్రూడ్ ధరలు బుధవారం ఒక శాతం మేర తగ్గడం, లిక్విడిటీని పెంచేందుకు రిజర్వు బ్యాంక్ డిసెంబర్ 6న ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి రూ.10,000 కోట్లను తీసుకురానుండటం, క్రూడ్ ధరల పెరుగుదల సహా దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరడగం కారణంగా ఇండియన్ రూపాయి డిసెంబర్ 4న 3 పైసలు క్షీణంచి 70.49కు తగ్గడం, దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) వేగంగా పుంజుకోవచ్చని అయితే మూడో త్రైమాసికంలో తక్కువగానే నమోదు కావొచ్చని నీతి ఆయోగ్ అంచనా వేయడం, ఉక్కు/ అల్యూమినియం దిగుమతి సుంకాల విషయంలో అమెరికాతో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న భారత్ అభ్యర్థనపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సానుకూలంగా స్పందించడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లోనే ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం భారీగా 3 శాతానికి పైగా నష్టపోవడం, దీర్ఘకాల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళనలు చెలరేగడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ-50లో భారతీ ఇన్ఫ్రాటెల్, ఏసియన్ పెయింట్స్, హిందుస్తాన్ పెట్రోలియం, గెయిల్, ఎన్టీపీసీ, ఐఓసీ, హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్, హిందాల్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యూపీఎల్, టాటా స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, వేదాంత, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, హిందాల్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. ఇక భారతీ ఇన్ఫ్రాటెల్ 1 శాతానికి పైగా పెరిగింది. హిందుస్తాన్ పెట్రోలియం 1 శాతం మేర లాభపడింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్ ఒక శాతానికి పైగా పడిపోయింది.
You may be interested
రూపీ డౌన్
Wednesday 5th December 2018అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, డాలర్ ఇండెక్స్ 97 స్థాయి పైకి వెళ్లడం వంటి అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే నేటి ఆర్బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9:05 సమయంలో ఇండియన్ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.31 శాతం తగ్గుదలతో 70.74 వద్ద ట్రేడవుతోంది. రూపాయి
మార్కెట్ ఎటు?
Wednesday 5th December 2018బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ నెగటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 64 పాయింట్ల నష్టంతో 10,848 పాయింట్ల వద్ద ఉంది. ♦ రిజర్వు బ్యాంక్ బుధవారం (నేడు) జరగనున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించడం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ♦ క్రూడ్ ధరలు బుధవారం ఒక శాతం