STOCKS

News


సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌..

Wednesday 3rd October 2018
Markets_main1538541392.png-20807

లాభాలతో ప్రారంభమై బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఇక నెగటివ్‌లో ప్రారంభమైన నిఫ్టీకి నష్టాలు మరింత పెరిగాయి. ఉదయం 9:51 సమయంలో సెన్సెక్స్‌ 210 పాయింట్ల నష్టంతో 36,315 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 10,931 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఒకానొక సమయంలో 280 పాయింట్లమేర క్షీణించింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,606-36,246 పాయింట్ల మధ్య, నిఫ్టీ 10,982-10,910 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. రూపాయి తొలిసారి అమెరికా డాలర్‌తో పోలిస్తే 73 మార్క్‌ దిగువకు పతనం కావడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. 

నిఫ్టీ-50లో యస్‌ బ్యాంక్‌ 7 శాతానికిపైగా ఎగసింది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, సిప్లా షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. అదేసమయంలో ఐషర్‌ మోటార్స్‌ 7 శాతంమేర పతనమైంది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేరు దాదాపు 5 శాతం క్షీణించింది. ఇక అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, మారుతీ సుజుకీ, విప్రో షేర్లు 2 శాతానికిపైగా తగ్గాయి. 
సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఆటో గరిష్టంగా 2 శాతంమేర క్షీణించింది. 
 
కాగా బుధవారం సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,526 పాయింట్లతో పోలిస్తే 76 పాయింట్ల లాభంతో 36,602 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,008 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల నష్టంతో 10,982 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 



You may be interested

బీమా బ్రోకింగ్‌లోకి 100% ఎఫ్‌డీఐలు?

Wednesday 3rd October 2018

న్యూఢిల్లీ: బీమా రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం బ్రోకింగ్‌, బీమా కంపెనీలు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్‌ మొదలైన బీమా రంగ వ్యాపార విభాగాల్లోకి 49 శాతం వరకూ మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. "బీమా బ్రోకింగ్ కూడా ఇతరత్రా ఆర్థిక సేవలు, కమోడిటీ బ్రోకింగ్ సేవల్లాంటిదే. ఇందులో వంద శాతం ఎఫ్‌డీఐలను

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 3rd October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హోటల్‌ లీలా:- ఎల్‌ఐసీకి రూ.22.50 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైంది. బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఎంఫసిస్‌:- షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.1350ల చొప్పున ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌:- రుణాల ద్వారా నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-

Most from this category